Fariduddin
-
ఫరీదుద్దీన్‌కు కన్నీటి వీడ్కోలు
జహీరాబాద్ టౌన్/ఝరాసంగం (జహీరాబాద్): అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరీదుద్దీన్‌కు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లాలోని ఆయన స్వగ్రామమైన హోతి(బి) శ్మశానవాటిలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూసిన ఫరీదుద్దీన్ పార్థివ దేహాన్ని రాత్రి ఆయన స్వగ్రామం హోతి (బి)కి తీసుకొచ్చారు. గ్రామస్తు ల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంట ల వరకు ఇంటివద్దనే ఉంచారు. తర్వాత ఆయన పార్థివ దేహాన్ని జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియానికి తీసుకువచ్చారు. కడసారి చూపుకోసం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చా రు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన పార్థి వ దేహాన్ని ఉంచి ఊరేగింపుగా ఈద్గా మైదానం వద్దకు తీసుకెళ్లారు. పార్థనల తర్వాత హోతి(బి)లో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులు గౌరవ వందనం చేసి గాలిలో కాల్పులు జరిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ బీబీపాటిల్ పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు పొల్గొన్నారు. పార్టీకి తీరని లోటు: మంత్రి కేటీఆర్ మంచి మనిషి ఫరీదుద్దీన్ అకాల మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ ఆయన మరణ వార్త వినగానే సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రికి స్వల్ప అనారోగ్యం వల్ల జహీరాబాద్‌కు రాలేకపోయారన్నారు. -
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్ : శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి మహ్మద్ ఫరీదుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ఉపసంహరణల గడువు ముగిసింది. అయితే, ఈ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం ఫరీదుద్దీన్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ ప్రతం అందజేశారు. -
ఎమ్మెల్సీ స్థానానికి ఫరీదుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక !
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలకు సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫరీదుద్దీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నిక జరగనుంది. నామినేషన్ ఉపసంహరణకు అక్టోబర్ 17 వరకు గడువుంది. ఆ రోజున ఫరీదుద్దీన్ ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. -
టీఆర్ఎస్లో చేరిన ఫరీదుద్దీన్, నరేంద్రనాథ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన చాగన్ల నరేంద్రనాథ్, మెదక్ జిల్లాకే చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత స్వామిచరణ్ సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు ఈ ముగ్గురు నేతలు, వారి అనుచరులు, పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను స్వయంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఒక్కొక్కరినీ పేరుపేరునా పలుకరించిన కేసీఆర్ వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ దక్కేలా సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం వారికి సూచించారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ‘జిల్లాకు చెందిన సీనియర్ నేతల చేరికతో పార్టీకి మరింత బలం చేకూరింది. అంతా కలిసి పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేస్తాం. ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసమే పార్టీకి విజయాన్ని సాధించి పెడుతుంది’ అని పేర్కొన్నారు. అనంతరం హరీశ్‌రావు, పార్టీలో చేరిన నేతలు సంగారెడ్డి సభలో పాల్గొనేందుకు ర్యాలీగా సంగారెడ్డి బయలుదేరి వెళ్లారు. టీఆర్ఎస్లో చేరుతున్నా: మదన్‌లాల్ సాక్షి, ఖమ్మం: తైలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని చూసే టీఆర్ఎస్లో చేరుతున్నానని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ వెల్లడించారు. వైఎస్సార్సీపీకి, ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన విలేకరులతో చెప్పారు. కాగా, సీఎం చంద్రశేఖర్‌రావును కాంగ్రెస్‌కు చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం హైదరాబాద్‌లో కలిశారు. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ నేత ఎండీ ఫరీదుద్దీన్ టీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఏడాది కాలంగా ఫరీదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి గీతారెడ్డితో విభేదాలు తలెత్తాయి. దాంతో అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఫరీరుద్దీన్ పరోక్షంగా టీఆర్ఎస్కు మద్దతు పలికారని గీతారెడ్డి అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దాంతో ఫరీద్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం నెల రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఫరీద్ టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులంతా టీఆర్ఎస్లో చేరారు.