సాక్షి, హైదరాబాద్ : అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళి అర్పించింది. నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగువాడి గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలన గావించేందుకు ఆయన సల్పిన కృషి ఎన లేనిదని కొనియాడారు. తెలుగువాళ్లందరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన ఆయన ప్రతి తెలుగువాడి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న అమరుడని కీర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment