బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయుడు, యువ పారిశ్రామికవేత్త జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి భారీ విరాళాన్ని ప్రకటించారు.
లండన్: బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయుడు, యువ పారిశ్రామికవేత్త జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. లండన్‌లో పార్లమెంటు స్క్వేర్‌లో ఏర్పాటుచేయనున్న ఈ విగ్రహానికి నైన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ డెరైక్టర్, హోటళ్ల యజమాని వివేక్ చద్దా (26) రూ.93 లక్షలు (లక్ష పౌండ్లు) ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, బజాజ్ ఆటో చీఫ్ రాహుల్ బజాజ్‌లు రూ.1.86 కోట్ల చొప్పున విరాళమిచ్చారని గాంధీ విగ్రహ స్మారక ట్రస్ట్ వ్యవస్థాపకుడు లార్డ్ మేఘ్‌నాథ్ దేశాయ్ తెలిపారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు.