రాజమండ్రి రూరల్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని కాతేరు వద్ద గోదావరిపై నిర్మాణంలో ఉన్న వంతెన రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతింది. ఉభయగోదావరి జిల్లాలను కలిపేందుకు రాజమండ్రి-కొవ్వూరు మధ్య నాలుగు వరుసల వంతెన రహదారిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. కాగా ఈ వంతెన రోడ్డును జూలై 1వ తేదీన సీఎం చంద్రబాబుతో ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి దెబ్బతింది. వంతెనపైకి వెళ్లే రోడ్డు రిటైనింగ్ వాల్ సుమారు 20 మీటర్ల మేర కొట్టుకుపోయింది. ఈ పాటి వర్షాలకే ఇలా అయితే.. ఇక ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోననే సందేహలు వ్యక్తం అవుతున్నాయి.