గాలివాన బీభత్సానికి వాహనాలు ధ్వంసం | Vehicles damaged due to Heavy rain | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సానికి వాహనాలు ధ్వంసం

Apr 17 2016 7:54 PM | Updated on Sep 3 2017 10:08 PM

నగరంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సానికి కొత్తపేట టెలిఫోన్ కాలనీలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

హైదరాబాద్: తీవ్రమైన ఎండ వేడిమి నుంచి ఆదివారం కురిసిన వర్షంతో రాజధాని నగరం కాస్త కుదుటపడినట్లయింది. అయితే గాలివాన బీభత్సానికి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది.

కొత్తపేట టెలిఫోన్ కాలనీలో ఈదురుగాలుల ధాటికి కారు బానెట్ ధ్వంసంకాగా, నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం సెంట్రింగ్ కూలి మరో ఐదు కార్లు, రెండు బైకులు, ఒక ఆటో చిత్తయ్యాయి. అదృష్టవశాత్తు నిర్మాణం కాకుండా కేవలం కర్రలు మాత్రమే పడిపోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. టెలిఫోన్ కాలనీ ప్రధాన రహదారిపైనే ఈ ప్రమాదం సంభవించడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించే పనిలో ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement