బీజింగ్: చైనాలో పెను ప్రమాదం సంభవించింది. భూగర్భంలో ఓ గ్యాస్ పైప్ బద్దలైంది. అయితే, అక్కడ పనిచేస్తున్నవారు అప్రమత్తమవడంతో ఆ ప్రమాదం ప్రాణనష్టం, ఆస్తి నష్టం వైపు దారి తీయలేదు. బీజింగ్ మున్సిపల్ కమిషన్ పరిధిలోని డోంగ్రాగ్జియాన్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కొందరు వ్యక్తులు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా భూమి లోపల ఉన్న గ్యాస్ పైప్ లైను పగిలిపోయింది. అయితే అప్రమత్తమైన అధికారులు అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే ప్రత్యేక బృందాన్ని దించడంతో వారు దాన్ని సరిచేశారు. సమర్థంగా దానికి మూత పెట్టగలిగారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.
చైనాలో బద్దలైన గ్యాస్ పైప్ లైన్
Published Thu, Mar 31 2016 1:18 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM
Advertisement
Advertisement