జీరో కోవిడ్ పాలసి నిబంధనల కారణంగానే నా మూడేళ్ల కొడుకు చనిపోయాడంటూ ఓ తండ్రి ఆగ్రహావేశాలతో విరుచుకుపడ్డాడు. ఈ కరోనా నిబంధనలే నా కొడుకు నిండు నూరేళ్ల జీవితాన్ని పరోక్షంగా పొట్టన బెట్టుకుందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తువో షిలీ గన్సు ప్రావిన్షియల్ రాజధాని లాన్‌జౌకి చెందిన టువో ఈ కోవిడ్-19 కఠిన నిబంధనల కారణంగానే తన కొడుకుని పొగొట్టుకున్నాని స్థానికి మీడియాకు తెలిపాడు. తన భార్య వంట చేస్తుండగా గ్యాస్ లీకైందని, మొదటగా తన భార్య స్ప్రుహతప్పి పడిపోయిందని, ఆ తర్వాత తన కొడుకు వెన్క్సువాన్ కూడా అపస్మారక స్థితిలో వెళ్లిపోయినట్లు చెప్పాడు.
దీంతో తన కొడుకును వెంటనే సీఆర్‌పీ చేయించేందుకు స్థానిక కమ్యూనిటి ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది టువోని లోనికి వెళ్లనివ్వలేదు. కొందురు అంబులెన్స్‌కి ఫోన్ చేయమని సలహ ఇచ్చారు. అక్కడే 30 నిమిషాలు వృధా కావడంతో వెన్స్కువాన్ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అంబులెన్స్ కోసం చూడకుండా, స్థానికుల సాయంతో ట్యాక్సిలో కొడుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ ప్రాంతమంతా లాక్‌డౌన్ విధించడంతో పలుచోట్ల చెక్‌పోస్ట్‌ల వద్ద అనుమతి లిభించలేదు. ఏదోలా ప్రయాసపడి ఆస్పత్రికి చేరుకున్న తన కొడుకు ప్రాణాలు మాత్రం దక్కలేదని ఆవేదనగా చెప్పాడు.
ఈ విషయమై లాన్‌జౌ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ స్పందించలేదు. ఈ కరోనా కఠిన ఆంక్షలు పరోక్షంగా నా కొడుకు ప్రాణాన్ని పొట్టనబెట్టుకుందంటూ టువో భోరున విలపించాడు. ఈ ఘటన సోషల్ మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీగాక రిటైర్డ్ స్థానిక అధికారి ఈ విషయామై ఆందోళన చేయను, పరిహారం కోరను అనే అగ్రిమెంట్‌పై సంతకం చేస్తే సుమారు రూ. 11 లక్షలు ఇస్తానంటూ ఒక ఆఫర్ ఇచ్చినట్లు టువో చెబుతున్నాడు. తాను దాన్ని తిరస్కరించినట్లు తెలిపాడు. ఆఖరికి తన కొడుకు అంత్యక్రియలు తన ఇంటి సమీపంలోనే జరిగాయని, క్యారంటైన్‌లో ఉండాల్సి వస్తుందన్న భయంతో హాజరు కాలేకపోయానని వాపోయాడు.
(చదవండి: లాక్‌డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం)
Comments
Please login to add a commentAdd a comment