సిలిండర్‌ లీకై ఇల్లు ధ్వంసం | cylinder blast | Sakshi

సిలిండర్‌ లీకై ఇల్లు ధ్వంసం

Published Wed, Aug 3 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

సిలిండర్‌ లీకై ఇల్లు ధ్వంసం

సిలిండర్‌ లీకై ఇల్లు ధ్వంసం

లింగంపేట : లింగంపేట మండల కేంద్రంలో సిలిండర్‌ లీక్‌ అయ్యి ఇల్లు ధ్వంసమైంది. గ్రామానికి చెందిన కొత్వాలి(కడారి) అంజవ్వ ఆర్‌సీసీ భవనంలో మెంగారం గ్రామానికి చెందిన బత్తుల రాములు అనే ఉపాధ్యాయుడు అద్దెకు ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోవడంతో కొత్త సిలిండర్‌ తెచ్చి రెగ్యులేటర్‌ బిగిస్తుండగా వాచర్‌ పనిచేయలేదు. దాంతో గ్యాస్‌ ఒక్కసారిగా లీక్‌ అయ్యింది. ఇంట్లో సెల్ఫ్‌లలో దేవత చిత్రపటాల ముందు పూజచేసి వెలిగించిన దీపం  ఉండడంతో మంటలు వెంటనే వ్యాపించాయి. రాములు భార్య, ఇద్దరు పిల్లను తీసుకొని బయటకు పరుగులు తీశాడు. క్షణాల్లో మంటలు రెండు గదుల్లో వ్యాపించగా పెద్ద శబ్దంతో భవనానికి పగుళ్లు వచ్చాయి. ఇంటి దర్వాజ ఎగిరి బయట పడింది. ఈ శబ్దానికి చుట్టుపక్కల వారు చే రుకుని భయాందోళన చెందారు. పక్కనే ఉన్న బోరు మోటారు ప్రారంభించి పైపులతో మంటలను ఆర్పివేశారు. పక్కనే ఉపాధ్యాయుడు ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం తెచ్చిపెట్టిన రూ. లక్ష నగదు, కూలర్, ఫ్రిజ్, టీవీ, వంటపాత్రలు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. పక్క పోర్షన్‌లో కోమట్‌పల్లి రాజు అద్దెకు ఉంటున్న గదులకు పగుళ్ల వచ్చాయి. ఘటన స్థలానికి తహసీల్దార్‌ కోదండరాంరెడ్డి, సర్పంచ్‌ అఫ్రోజ్‌ తదితరులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పంచనామ నిర్వహించి రూ. 3 లక్షలు ఆస్తినష్టం వాటిలినట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement