నిజాంసాగర్‌ కెనాల్‌కు గండి.. ఇళ్లలోకి నీరు | Villages Submerged Due To Nizam Sagar Canal Damage | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్‌ కెనాల్‌కు గండి.. ఇళ్లలోకి నీరు

Published Mon, Apr 1 2024 9:06 AM | Last Updated on Mon, Apr 1 2024 10:45 AM

Villages Submerged Due To Nizam Sagar Canal Damage - Sakshi

నిజామాబాద్ జిల్లా:  ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్‌కు గండి పడింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సొమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇండ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో..చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ స్థానికుల ఆరోపణ చేస్తున్నారు. త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement