
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక కట్టడం చార్మినార్ సుందీకరణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. ఒక మీనార్ పైన వున్న ఆర్చిలోని ఒక భాగం నేల కూలింది. రాత్రి జరిగిన ఈ ఘటనతో పాతబస్తీ ఉలిక్కిపడింది. అది కూలిన సమయంలో కింద ఎవరూ లేక పోవడంతో ఎటువంటి ప్రాణహానీ జరుగలేదు. కొద్దిరోజులుగా చార్మినార్ సుదరీకరణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే సుందీకరణ పనులు పూర్తయిన మినార్ ఆర్చిలోని కొంతభాగం ఇప్పుడు కూలింది. అయితే ఎండ వేడి వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణమా అన్న విషయమై పురావస్తు శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.