కృష్ణుడి బాల ఆలయంలో విగ్రహాలూ మాయం
వరుస ఘటనలతో రామవరప్పాడు ప్రజల్లో భయాందోళనలు
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత వరి శ్రీదేవి కుమారుడి కారును గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 5వ తేదీరాత్రి ప్రసాదంపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కొమ్మా కోట్లు కారు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ సీపీకి చెందిన రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి కుమారుడు గణేష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల రామవరప్పాడుకు తన కుటుంబంతో కలిసి కారులో వచ్చారు. తన కారును రైవస్ కాలువ వంతెన సమీపంలోని కృష్ణుడి బాల ఆలయం (కోర్టులో వేయడంతో నిర్మాణం ఆగింది) వద్ద పార్కింగ్ చేశాడు.
గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా కృష్ణుడి బాల ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించారు. తెల్లారిన తర్వాత కారుపై దాడి విషయాన్ని గమనించి పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలు బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమిటని ప్రశి్నస్తున్నారు. పటమట సీఐ మోహన్‌రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment