
ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా నేడు (జూన్ 16) విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద జై శ్రీరామ్ నామంతో ప్రభాస్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. సినిమా ఇప్పటికే హిట్ టాక్ అందుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు మంచి బజ్ రావడంతో థియేటర్లలో బొమ్మ పడటం ఒక నిమిషం ఆలస్యం అయినా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
(ఇదీ చదవండి: ఎవరైనా అలాంటి వేషాలు వేస్తే.. తాట తీస్తాం: ప్రభాస్ ఫ్యాన్స్)
తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం వల్ల యాజమాన్యంతో ఫ్యాన్స్ గొడవకు దిగారు. థియేటర్ సిబ్బంది సర్దిచెప్పడంతో సమస్య సద్దుమనిగింది. కానీ వారు థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత అసలు సమస్య మొదలైంది. సినిమా ప్రారంభం అయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో వారికి డైలాగ్‌లు అర్థం అవ్వడం లేదని మళ్లీ గొడవకు దిగడమే కాకుండా థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో చేసేదేమి లేక థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపేశారు.
(ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?)
Comments
Please login to add a commentAdd a comment