Allu Arjun Open His Multiplex AAA With Prabhas Adipurush Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun AAA Cinemas: ప్రభాస్‌ 'ఆదిపురుష్'పై నమ్మకం పెట్టుకున్న బన్నీ

Published Sat, Jun 10 2023 3:59 PM | Last Updated on Sat, Jun 10 2023 4:50 PM

Allu Arjun Open His Multiplex AAA Prabhas Adipurush - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే టాలీవుడ్‌లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ   మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్‌ను మహేష్‌ నిర్మించగా..  విజయ్‌ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్‌ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్‌ను నిర్మించాడు.  తాజాగా వీరి రూట్లోనే అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నాడు. హైదరాబాద్‌లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్,  800 జూబ్లీ అనే పబ్‌ను నడిపిస్తున్నాడు బన్నీ. వీటంన్నిటితో పాటు గతేడాది అమీర్‌ పేట్‌లో  మల్టీప్లెక్స్  నిర్మాణ పనులు మొదలుపెట్టిన విషయం తెల్సిందే.

(ఇదీ చదవండి: ఇలియానాపై ట్రోల్స్‌.. అతని ఫోటో రివీల్‌)

ఇప్పటికే అది పూర్తయ్యింది. ఏషియన్స్ సినిమాస్, అల్లు అర్జున్ పేరు వచ్చేలా 'AAA' సినిమాస్ పేరు కూడా పెట్టేశాడు. తాజాగా వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం ఈ థియేటర్‌ను జూన్‌ 16న బన్నీ ప్రారంభించనున్నారట. అదేరోజు ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' విడదల కానుంది.  రాముని సినిమాతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభిస్తే శుభసూచకమని భావించి పనులను కూడా వేగవంతం చేయించాడట. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. అన్ని అనుకూలిస్తే..  జూన్ 16 న 'AAA' సినిమాస్‌లో మొట్టమొదటి  స్క్రీనింగ్‌గా ఆదిపురుష్ ఉండనుంది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థ వేడుకలో మెరిసిపోయిన లావణ్య.. చీర ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement