అందంగా కనపడితే.. క్షమించేస్తారు!
తప్పులు చేయడం మానవ సహజం. అయితే.. కాస్త అందంగా, ఆకర్షణీయంగా ఉండేవాళ్లు తప్పు చేస్తే మాత్రం వాళ్లను మహిళలు ఈజీగా క్షమించేస్తారట! ఈ విషయం కొత్త పరిశోధనలో తేలింది. అమెరికాలోని ఈస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్సన్, జొనాథన్ గోర్ అనే పరిశోధకులు ఈ అంశంపై విస్తృతంగా శోధించారు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే అతడిని క్షమించాలా.. వద్దా అనే విషయం వాళ్లు ఎంత అందంగా ఉన్నారనేదానిపై ఆధారపడుతుందట.
అంత అందంగా లేనివాళ్లను కొంత సేపటి వరకు క్షమిస్తారని, అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం చెంపదెబ్బలు తప్పవని గిబ్సన్ అంటున్నారు. దీనికోసం మొత్తం 170 కాలేజీలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిల మీద పరిశోధన చేశారు. బాగా ఆకర్షణీయంగా ఉండేవాళ్లు, అసలు ఉండని వాళ్ల ముఖాలు చూపించి.. సందర్భాలు కూడా సృష్టించి ఇచ్చారు. అలాంటి సమయాల్లో అమ్మాయిల రియాక్షన్లు ఎలా ఉన్నాయో గమనించి.. తమ పరిశోధన నివేదికను సమర్పించారు. వీరి పరిశోధన స్ప్రింగర్స్ జర్నల్లో ప్రచురితమైంది.