
గవర్నర్‌ను ఇక క్షమాభిక్ష కోరను
క్షమాభిక్ష కోసం మహారాష్ట్ర గవర్నర్ ముందు భవిష్యత్తులో పిటిషన్ దాఖలు చేయనని, తన తరఫున ఎవరూ ఆ ప్రయత్నం చేయొద్దని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శుక్రవారం స్పష్టం చేశారు.
ముంబై: క్షమాభిక్ష కోసం మహారాష్ట్ర గవర్నర్ ముందు భవిష్యత్తులో పిటిషన్ దాఖలు చేయనని, తన తరఫున ఎవరూ ఆ ప్రయత్నం చేయొద్దని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శుక్రవారం స్పష్టం చేశారు. క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ దాఖలు చేసిన దరఖాస్తును ఆ రాష్ట్ర గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. ఇంకెప్పుడూ కట్జూగాని, దత్ కుటుంబసభ్యులుగాని దత్ తరఫున గవర్నర్ ముందు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయవద్దని ఆయన న్యాయవాదులు తెలిపారు. త్వరలో దత్ జైలు శిక్షాకాలం పూర్తి అవుతుందన్నారు. 1993 బాంబు పేలుళ్లకు సంబంధించి సంజయ్ దత్ పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.