ప్రతీకాత్మక చిత్రం
గల్ఫ్ డెస్క్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పరిధిలో వీసా, వర్క్ పర్మిట్ లేకుండా అక్రమం గా ఉంటున్న విదేశీ కార్మికుల నుంచి ఎలాంటి జరిమానా వసూలు చేయకుండా, జైలు శిక్ష విధించకుండా వారిని స్వదేశాలకు పంపిం చేందుకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. 2013లో క్షమాభిక్షను రెండు నెలల పాటు అమలు చేసిన యూఏఈ ప్రభుత్వం ఐదేళ్ల తరువాత మరోసారి క్షమాభిక్ష అమలు చేస్తుంది.
‘ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్’ అనే కార్యక్రమం పేరుతో ఈ సంవత్సరానికి గాను క్షమాభిక్షను ప్రసాదించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్(ఎఫ్‌ఏఐసీ) చైర్మన్ అలీ మహ్మమద్ బిన్ అహమ్మద్ అల్ షంసీ రెండు రోజుల క్రితం వెల్లడించిన వివరాల ప్రకారం.. క్షమాభిక్ష ఆగస్టు ఒకటో తేది నుంచి మూడు నెలల పాటు అమలు లోకి రానుంది.
2013లో క్షమాభిక్ష సమయంలో 62వేల మంది విదేశీ కార్మికులు ఎలాంటి జరిమా నాలూ చెల్లించకుండా, జైలు శిక్ష అనుభవించ కుండా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ సంవ త్సరం జనవరిలో కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష అమలు చేయగా 1.32 లక్షల మంది వినియో గించుకున్నారు. యూఏఈ పరిధిలో దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మన్, పుజీరా, రసల్ ఖైమా, ఉమ్మ ల్ ఖ్వాయిస్న్ రాష్ట్రాలు ఉన్నాయి.
షార్జా, దుబా య్, అబుదాబీలలో తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంతో మంది కార్మికులు వివిధ పనులు చేస్తున్నారు. కొందరు కంపెనీ వీసాలపై వెళ్లగా మరి కొందరు విజిట్ వీసాలపై వెళ్లారు. కంపెనీ వీసాలపై వెళ్లిన వారు తమకు పని సరిగా లేకపోవడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చి దొరికిన పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అలాగే విజిట్ వీసాలపై వెళ్లిన వారు గడువులోగా ఇంటికి రాకుండా అక్కడే ఏదో ఒక పనిలో ఉండి పోయారు.
కంపెనీల నుంచి బయటకు వచ్చిన వారు మరో కంపెనీలో పనిచేయాలంటే వర్క్ పర్మిట్ మార్చుకోవాల్సి ఉంటుంది. వీసా, వర్క్ పర్మిట్ లేకుండా పనిచేయడం యూఏఈ నిబంధనలకు విరుద్ధం. చట్టవిరుద్ధం గా ఉంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుందని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షను అమలులోకి తీసుకురావాలని నిర్ణ యించింది. క్షమాభిక్ష అమలైతే వీసాల పునరుద్ధ రణ జరిగే అవకాశం ఉంది.
అలాగే జరిమానా, జైలు శిక్షలు లేకుండా స్వగ్రామానికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సొంతూరికి రావాలనుకునే వారు విమాన చార్జీలు వారే భరించుకోవాల్సి ఉంటుంది. యూఏఈ పరిధిలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ వాసుల సంఖ్య దాదాపు 20వేల వరకు ఉంటుందని అంచనా. మనవారు ఇంటికి వస్తారా లేక విసా పునరుద్ధరణ చేసుకుంటారా అనే ఆంశంపై క్షమాభిక్ష అమలులోకి వచ్చిన తరువాతనే స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment