kuwait jail
-
హత్యల కేసులో నిందితుడు.. కువైట్ జైలులో ఏపీవాసి అనుమానాస్పద మృతి
కువైట్‌లో హత్య కేసులో జైలులో ఉన్న వైఎస్సార్‌జిల్లా వాసి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం సెంట్రల్ జైలు కస్టడీలో ఉన్నఅతను బుధవారం సాయంత్రం తన గదిలో రెండు వరసల మంచానికి.. గుడ్డతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ‘అరబ్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. వెంకటేష్ అత్మహత్యపై ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ విభాగానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంట ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. కువైట్ లో ఆత్మహత్యకు పాల్పడిన పిల్లోల్ల వెంకటేష్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎపీఎన్ఆర్టీ ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. (చదవండి: ‘నా భర్తను ఇండియాకు పిలిపించండి.. అన్యాయంగా ఇరికించారు’ ) నా భర్తను అన్యాయంగా ఉరి వేసి చంపారు వెంకటేష్ మరణ వార్త తెలియగానే అతని భార్య స్వాతి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తను అన్యాయంగా ఉరి వేసి చంపేశారని, ఇక తన పిల్లలకు దిక్కెవరంటూ మృతుడి భార్య స్వాతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆఖరికి తన భర్త చివరి చూపైనా దక్కుతుందా లేదా అని స్వాతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏ తప్పూ చేయని తన భర్తను ప్రభుత్వాలు కాపాడలేకపోయాయని ఆమె తల్లడిల్లుతోంది. వెంకటేష్ మరణవార్తతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన పిలోళ్ల శ్రీరాములు కుమారుడు వెంకటేష్ కువైట్‌లో ఓ సేఠ్ వద్ద టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్దియా పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన సేఠ్ అహ్మద్ (80), అతని భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసి అక్కడి జైల్లో ఉంచారు. ఆయన భార్య స్వాతి కూడా కువైట్‌లోని ఓ న్యాయవాది ఇంట్లో పనిచేస్తోంది. అయితే న్యాయవాది సహాయంతో ఈ నెల 10న కువైట్ నుంచి వైఎస్సార్ జిల్లాకు వచ్చిన వెంకటేష్ భార్య స్వాతి శుక్రవారం తన పిల్లలు జయవర్ధన్, విష్ణువర్ధన్, అత్తామామలు శ్రీరాములు, రమణమ్మ, కుటుంబసభ్యులతో కలిసి తన భర్త ఏ నేరమూ చేయలేదని, స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని కడప కలెక్టర్ వి.విజయకుమార్ రాజుకు స్వాతి విజ్ఞప్తి చేసింది. కలెక్టర్ కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. Triple murder accused commits suicide in prison#Kuwait #Indian #India #Kuwaiti #Murder #Suicide #Prisonhttps://t.co/ETqlP3NSe6— ARAB TIMES - KUWAIT (@arabtimeskuwait) March 16, 2022 -
కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్/ మోర్తాడ్ (బాల్కొండ): కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో కువైట్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తోన్న, చిల్లర నేరాలకు పాల్పడిన విదేశీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారందరినీ వారి మాతృదేశాలకు పంపేందుకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కువైట్ ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీనికోసం వివిధ దేశాలవారికి వేర్వేరు తేదీలను కేటాయించగా, భారతీయులకు 11 నుంచి 14వ తేదీలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భారత్‌లో 14వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన క్రమంలో ప్రత్యేక అనుమతి కోసం భారత ప్రభుత్వంతో కువైట్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. -
కువైట్‌లో అరెస్టయిన ప్రవాసాంధ్రులు విడుదలయ్యేనా?
సాక్షి, రాజంపేట(కడప) : కువైట్‌లో జిల్లా వాసుల అరెస్టు టెన్షన్ రోజురోజుకు పెరుగుతోంది. నాలుగు రోజులు దాటిపోతున్నా విడుదల విషయంలో కువైట్ ప్రభుత్వం కనికరం చూపడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప తదితర ప్రాంతాలకు చెందిన వారు దాదాపు లక్ష మంది గల్ఫ్‌దేశాలకు జీవనోపాధి కోసం వెళ్లారు. నిరసన తెలిపినందుకు బందీఖానా ఉచ్చు.. వరంగల్‌లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటనపై స్పందించిన కువైట్ దేశంలోని ప్రవాసాంధ్రులు శుక్రవారం మాల్వియా ప్రాంతంలో నిరసన తెలిపారు. దీంతో వారు బందీ ఖానాలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఏయే జైళ్లలో ఉన్నారు.. కువైట్ దేశంలో ఉంటూ అక్కడి చట్టాలు తెలియకపోవడంతో ప్రవాసాంధ్రులు జైలు పాలయ్యారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఈ కేసు విషయంలో విదేశాంగ మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవాలనే విజ్ఞప్తులు వెళుతున్నాయి. వీరంతా కువైట్ దేశంలోని షామియా, మాలియ, సులేబియా జైళ్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ప్రవాసాంధ్రులకు సంబంధించిన కొంతమంది పెద్దలు వీరి విడుదల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల చేస్తారా? చేయరా? జీవనోపాధి కోసం వెళ్లిన తమ వారు అరెస్టు కావడంతో వారి సంబంధీకులు విడుదల చేస్తారా? చేయారా అనే ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా గల్ఫ్ దేశంలో నిరసన సభ, ప్రదర్శన నిర్వహించడం తీవ్ర నేరం. దీనికి జైలుశిక్ష పూర్తయినా తర్వాత వీసా రద్దు చేసి ఏ గల్ఫ్‌దేశంలోనూ అడుగుపెట్టకుండా జీవిత కాలం నిషేధం విధిస్తారనే ప్రచారం జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒకే ఒక్కడు విడుదల.. నిరసన సందర్భంగా కువైట్ నిఘా అధికారులు అరెస్టు చేసిన వారిలో ఒక్కరిని మాత్రం వదిలి వేసినట్లుగా కువైట్ ప్రవాసాంధ్రుల వర్గాల నుంచి అందిన సమాచారం. విడుదలైన ఆ ఒక్కరికి, ఆ దేశంలోని పలుకుబడి కలిగిన షేఠ్ సిఫార్సుతో కువైట్ పోలీసులు విడుదల చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. విదేశాంగమంత్రిని కలిసిన రాజంపేట ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి మంగళవారం కేంద్ర విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ అరెస్టు అయిన వారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని అభ్యర్ధించారు. ఇండియన్ ఎంబీసీకి డిప్యూటీ సీఎం లేఖ.. కువైట్‌లో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ఈ లేఖను రాయబార కార్యాలయ అధికారి హెచ్ఈ కె.జీవసాగర్కు పంపారు. అలాగే ఇదే ప్రతిని ప్రధానమంత్రి కార్యాలయానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపారు. పట్టువదలని కువైట్ ప్రభుత్వం.? కువైట్ దేశం నిరసన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. అరెస్టయిన 52 మందిలో జిల్లాకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తమ వారిని విడిపించాలని అరెస్టు అయిన వారి కుటుంబీకులు వేడుకుంటున్నారు. కువైట్ దేశంలో ఉన్న ప్రవాసాంధ్రులు అరెస్టు అయిన వారి కోసం ఇండియన్ ఎంబసీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఖల్లివెల్లి కార్మికులకు క్షమాభిక్ష
గల్ఫ్ డెస్క్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పరిధిలో వీసా, వర్క్ పర్మిట్ లేకుండా అక్రమం గా ఉంటున్న విదేశీ కార్మికుల నుంచి ఎలాంటి జరిమానా వసూలు చేయకుండా, జైలు శిక్ష విధించకుండా వారిని స్వదేశాలకు పంపిం చేందుకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. 2013లో క్షమాభిక్షను రెండు నెలల పాటు అమలు చేసిన యూఏఈ ప్రభుత్వం ఐదేళ్ల తరువాత మరోసారి క్షమాభిక్ష అమలు చేస్తుంది. ‘ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్’ అనే కార్యక్రమం పేరుతో ఈ సంవత్సరానికి గాను క్షమాభిక్షను ప్రసాదించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్(ఎఫ్ఏఐసీ) చైర్మన్ అలీ మహ్మమద్ బిన్ అహమ్మద్ అల్ షంసీ రెండు రోజుల క్రితం వెల్లడించిన వివరాల ప్రకారం.. క్షమాభిక్ష ఆగస్టు ఒకటో తేది నుంచి మూడు నెలల పాటు అమలు లోకి రానుంది. 2013లో క్షమాభిక్ష సమయంలో 62వేల మంది విదేశీ కార్మికులు ఎలాంటి జరిమా నాలూ చెల్లించకుండా, జైలు శిక్ష అనుభవించ కుండా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ సంవ త్సరం జనవరిలో కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష అమలు చేయగా 1.32 లక్షల మంది వినియో గించుకున్నారు. యూఏఈ పరిధిలో దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మన్, పుజీరా, రసల్ ఖైమా, ఉమ్మ ల్ ఖ్వాయిస్న్ రాష్ట్రాలు ఉన్నాయి. షార్జా, దుబా య్, అబుదాబీలలో తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంతో మంది కార్మికులు వివిధ పనులు చేస్తున్నారు. కొందరు కంపెనీ వీసాలపై వెళ్లగా మరి కొందరు విజిట్ వీసాలపై వెళ్లారు. కంపెనీ వీసాలపై వెళ్లిన వారు తమకు పని సరిగా లేకపోవడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చి దొరికిన పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అలాగే విజిట్ వీసాలపై వెళ్లిన వారు గడువులోగా ఇంటికి రాకుండా అక్కడే ఏదో ఒక పనిలో ఉండి పోయారు. కంపెనీల నుంచి బయటకు వచ్చిన వారు మరో కంపెనీలో పనిచేయాలంటే వర్క్ పర్మిట్ మార్చుకోవాల్సి ఉంటుంది. వీసా, వర్క్ పర్మిట్ లేకుండా పనిచేయడం యూఏఈ నిబంధనలకు విరుద్ధం. చట్టవిరుద్ధం గా ఉంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుందని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షను అమలులోకి తీసుకురావాలని నిర్ణ యించింది. క్షమాభిక్ష అమలైతే వీసాల పునరుద్ధ రణ జరిగే అవకాశం ఉంది. అలాగే జరిమానా, జైలు శిక్షలు లేకుండా స్వగ్రామానికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సొంతూరికి రావాలనుకునే వారు విమాన చార్జీలు వారే భరించుకోవాల్సి ఉంటుంది. యూఏఈ పరిధిలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ వాసుల సంఖ్య దాదాపు 20వేల వరకు ఉంటుందని అంచనా. మనవారు ఇంటికి వస్తారా లేక విసా పునరుద్ధరణ చేసుకుంటారా అనే ఆంశంపై క్షమాభిక్ష అమలులోకి వచ్చిన తరువాతనే స్పష్టత రానుంది. -
కువైట్ కార్మికులకు క్షమాభిక్ష
న్యూఢిల్లీ: కువైట్‌లో అక్రమంగా ఉంటున్న వేలాది మంది భారతీయులకు పెద్ద ఊరటనిస్తూ ఆ దేశ ప్రభుత్వం మంగళవారం క్షమాభిక్షను ప్రకటించింది. కువైట్‌లో ఇన్నాళ్లూ అక్రమంగా ఉన్నందుకు వారిపై ఎలాంటి జరిమానాలు విధించబోమని ప్రభుత్వం చెప్పింది. కువైట్‌లోని ఖరాఫీ నేషనల్ అనే కంపెనీలో పనిచేయడానికి వెళ్లిన అనేక మంది భారతీయులకు వేతనాలు అందలేదు. దీంతో వీసా గడువు ముగిసినప్పటికీ తమ వేతనాలు రాబట్టుకునేందుకు అనేక మంది కార్మికులు అక్కడే ఉండిపోయారు. వీరంతా అక్రమంగా కువైట్‌లో నివసిస్తున్నందున రోజుకు రూ.424 జరిమానాగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అసలే జీతం లేక ఇబ్బందులు పడుతున్న వీరికి జరిమానాలు చెల్లించడం తలకు మించిన భారంగా ఉంది. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అక్రమంగా కువైట్‌లో ఉంటున్నవారు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22 మధ్య క్షమాభిక్షను వినియోగించుకుని భారత్‌కు వెళ్లిపోవచ్చంది. వీరిపై ఎలాంటి జరిమానా విధించబోమంది. దీంతో ఎంతో మంది భారతీయ కార్మికులు వేతనాలపై ఆశ వదులుకుని మళ్లీ తమ కుటుంబాలతో కలసి గడిపేందుకు స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు మొత్తం వేతనాలు చేతికి అందితేగానీ వెనక్కు రాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలుగు కార్మికులూ ఎక్కువే.. ఇప్పుడు క్షమాభిక్ష పొందిన వారు మరోసారి కువైట్‌కు చట్టబద్ధంగా వెళ్లి పనిచేసుకోవడానికి కూడా అర్హులు. ప్రస్తుతం కువైట్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఖరాఫీ నేషనల్ కంపెనీ కూడా భారత కార్మికులను సంప్రదించి వేతనాల్లో 25 నుంచి 33 శాతం సొమ్మును చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. అయితే కార్మికులు అందుకు ఒప్పుకోకుండా తమకు పూర్తి వేతనాలు చెల్లించాల్సిందేనని కోరుతున్నారు. వీరి సమస్య పరిష్కారం కోసం పోరాడిన సామాజిక కార్యకర్త షాహీన్ సయ్యద్ మాట్లాడుతూ ‘భారత కార్మికులకు ఇది గొప్ప ఉపశమనం’ అని అన్నారు. ఇటీవలే విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కువైట్‌లో పర్యటించిన నేపథ్యంలో కువైట్ తాజాగా క్షమాభిక్షను ప్రకటించడం గమనార్హం. భారతీయ కార్మికుల అవస్థల గురించి వీకే సింగ్ కువైట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
అమ్మ వచ్చింది..
వర్షకొండ (ఇబ్రహీంపట్నం), న్యూస్‌లైన్ : బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి.. అక్కడి నిబంధనలతో ఐదు నెలల పాటు జైలులో బందీ అయిన ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన కొంతం సుశీల తన ఐదుగురు పిల్లలతో కలిసి బుధవారం క్షేమంగా ఇల్లు చేరింది. పెళ్లయి.. ఓ కూతురు జన్మించాక.. భర్త నుంచి విడాకులు తీసుకున్న సుశీల 17 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆజాద్ వీసాపై కువైట్ వెళ్లింది. అక్కడ పలు గృహాల్లో పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పరిచయం కాగా వివాహమాడింది. మొదటి కాన్పుకోసం ఇక్కడకు వచ్చి బిడ్డ పుట్టాక ఇక్కడే వదిలి మళ్లీ కువైట్‌కు వెళ్లింది. అక్కడ మరో ఐదుగురికి జన్మనిచ్చింది. మహేశ్వరి, సాయిబాబా, నవీన్‌కుమార్, లయ, స్వప్న ఆమె పిల్లలు. ఈ క్రమంలో అక్కడి నిబంధనల ప్రకారం.. భర్తను స్వదేశానికి పంపించారు. సుశీలను అక్కడి పోలీసులు జైలులో బంధించారు. ఆమెతో ముగ్గురు పిల్లలు జైల్లో, ఇద్దరు బయట ఉండిపోయారు. సుశీల, ఆమె పిల్లల వ్యథను, వర్షకొండలో ఉన్న ఆమె మరో కూతురు వ్యథను ‘సాక్షి’ పలుమార్లు కథనాలుగా ప్రచురించింది. ఐదునెలల అనం తరం పిల్లలతోపాటు ఆమెకూ ఔట్ పాస్‌పోర్టులు ఇచ్చి స్వదేశానికి పంపించారు. విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఆమె.. అక్కడినుంచి ట్యాక్సీ ద్వారా ఇంటికి చేరుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆనం దం వెల్లివిరిసింది. ఎన్నాళ్లయ్యిందమ్మా.. నిను చూసి అం టూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ఆమె వద్దకు వెళ్లగా.. తన కష్టాలను ఏకరువు పెట్టింది. వీసాను రెన్యూవల్ చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో పోలీసులు పట్టుకుని జైల్లో వేశారని, లంచా లు ఇవ్వనిదే మనదేశ రాయబార కార్యాలయం అధికారులు జైల్లో నుంచి విడిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదుకునేవారు లేక తనలాంటి వారెందరో జైల్లో మగ్గుతున్నారని పేర్కొంది. అలాంటివారిని విడిపించేం దుకు ప్రభుత్వం సహకారం అందించాలని విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరింది. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది.