వర్షకొండ (ఇబ్రహీంపట్నం), న్యూస్‌లైన్ : బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి.. అక్కడి నిబంధనలతో ఐదు నెలల పాటు జైలులో బందీ అయిన ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన కొంతం సుశీల తన ఐదుగురు పిల్లలతో కలిసి బుధవారం క్షేమంగా ఇల్లు చేరింది. పెళ్లయి.. ఓ కూతురు జన్మించాక.. భర్త నుంచి విడాకులు తీసుకున్న సుశీల 17 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆజాద్ వీసాపై కువైట్ వెళ్లింది. అక్కడ పలు గృహాల్లో పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పరిచయం కాగా వివాహమాడింది. మొదటి కాన్పుకోసం ఇక్కడకు వచ్చి బిడ్డ పుట్టాక ఇక్కడే వదిలి మళ్లీ కువైట్‌కు వెళ్లింది. అక్కడ మరో ఐదుగురికి జన్మనిచ్చింది.
మహేశ్వరి, సాయిబాబా, నవీన్‌కుమార్, లయ, స్వప్న ఆమె పిల్లలు. ఈ క్రమంలో అక్కడి నిబంధనల ప్రకారం.. భర్తను స్వదేశానికి పంపించారు. సుశీలను అక్కడి పోలీసులు జైలులో బంధించారు. ఆమెతో ముగ్గురు పిల్లలు జైల్లో, ఇద్దరు బయట ఉండిపోయారు. సుశీల, ఆమె పిల్లల వ్యథను, వర్షకొండలో ఉన్న ఆమె మరో కూతురు వ్యథను ‘సాక్షి’ పలుమార్లు కథనాలుగా ప్రచురించింది. ఐదునెలల అనం తరం పిల్లలతోపాటు ఆమెకూ ఔట్ పాస్‌పోర్టులు ఇచ్చి స్వదేశానికి పంపించారు. విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఆమె.. అక్కడినుంచి ట్యాక్సీ ద్వారా ఇంటికి చేరుకుంది.
దీంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆనం దం వెల్లివిరిసింది. ఎన్నాళ్లయ్యిందమ్మా.. నిను చూసి అం టూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ఆమె వద్దకు వెళ్లగా.. తన కష్టాలను ఏకరువు పెట్టింది. వీసాను రెన్యూవల్ చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో పోలీసులు పట్టుకుని జైల్లో వేశారని, లంచా లు ఇవ్వనిదే మనదేశ రాయబార కార్యాలయం అధికారులు జైల్లో నుంచి విడిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదుకునేవారు లేక తనలాంటి వారెందరో జైల్లో మగ్గుతున్నారని పేర్కొంది. అలాంటివారిని విడిపించేం దుకు ప్రభుత్వం సహకారం అందించాలని విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరింది. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది.
అమ్మ వచ్చింది..
Published Thu, Jan 9 2014 5:40 AM | Last Updated on Tue, Aug 7 2018 4:24 PM
Advertisement
Advertisement