susila
-
ఎమ్మార్వో సుశీల ఇంటిపై ఏసీబీ దాడులు
నెల్లూరు : నెల్లూరు జిల్లా సంగెం తహసీల్దార్ సుశీల నివాసంపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే బెంగళూరులోని ఆమె బంధువుల నివాసంపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆమె వద్ద రూ. 2 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సంగెం తాహసీల్దార్ సుశీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. -
కిరోసిన్ పోసి నిప్పంటించాడు..
ఆస్తి తగాదా నేపథ్యంలో వృద్ధురాలిపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పట్టపగలు వృద్ధురాలి ఇంటికొచ్చి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చందర్లపాడులోని పాత ఇండియన్ బ్యాంకు వీధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పాపచర్ల సుశీల (85)కు ఓ స్థలానికి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన నెట్టెం జానకిరామయ్యతో వివాదం ఉంది. ఈ నేపథ్యంలో వృద్ధురాలు మంగళవారం ఉదయం ఇంట్లో ఉండగా జానకిరామయ్య వచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఎదురింట్లో ఉన్న మహిళ ఈ ఘటన చూసి హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పింది. వెంటనే 108 అంబులెన్సుకు, క్షతగాత్రురాలి మనవడికి ఫోన్ చేసింది. అంబులెన్స్ సిబ్బంది వచ్చి ఆమెను వెంటనే నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సుశీల తనకు స్థలం అమ్మినట్లు జానకిరామయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తీర్పు సుశీలకు అనుకూలంగా వచ్చింది. దీనిని సవాలు చేస్తూ అతడు జిల్లా కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఉదయం అతడు తనపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని సుశీల పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. ఈ మేరకు జానకిరామయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై ఎల్.రమేష్ తెలిపారు. సుశీలకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారంతా పెళ్లిళ్లయి వేర్వేరు గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త 30 ఏళ్ల కిందట మరణించాడు. -
సెలబస్: పాటల కోకిలపై మాటల కువకువలు
బాల నటుడిగా అలరించి, హీరోగా ఎదిగిన బాలాదిత్య... నటుడిగానే అందరికీ తెలుసు. కానీ అతడిలో ఒక కవి కూడా ఉన్నాడు. ఓ పక్క నటుడిగా కొనసాగుతూనే ఆదిత్య అక్షరాలతో చెలిమి చేశాడు. పాటలల్లాడు. కవితలు రాశాడు. అలా రాసిన కొన్ని కవితల్లో ఇదొకటి. గానకోకిల సుశీలమ్మపై అతడికున్న అభిమానానికి అక్షర రూపమిది. నటుడిగానే కాక కవిగా కూడా పేరు తెచ్చుకోవాలని తపిస్తోన్న బాలాదిత్య... త్వరలో తన కవితా సంకలనాన్ని వెలవరించాలని ఆశిస్తున్నాడు! విశాలమైన ఈ సినీగీతాల జగత్తులో సుశీలగారిదో ప్రత్యేక స్థానం... అది మరపురాని గానం ఆ కంఠం వినగా వైకుంఠమే కనవచ్చు ఆమె స్వరం కొరకై స్వర్గవాసులే దిగి వచ్చు పాత పాటకి పసిడి పూత - ఆ స్వర మాధుర్యం పాట పాటకీ నవనీత - ఆమె గళ చాతుర్యం ‘చిటపట చినుకు’ల పలుకులు విన్నా... ‘నీవని నేనని’ ఈవిడ అన్నా... అతి మధురం ప్రతి గీతం - మన మదికే నవనీతం ‘జననీ శివకామిని’ అంటూ స్తుతించి ఆ దేవిని జనులందరి జేజేలొందెను సుతిమెత్తని గాయని ‘సఖియా వివరించవె’ అన్నా - ‘హిమగిరి సొగసు’లనే కన్నా ‘నీవు లేక వీణ’ను విన్నా - ‘గోదారి గట్టుంది’ అన్నా ఆ గాత్రం తనకే సొంతం - తను మాత్రం అందరి సొంతం తెలుగువారింటి ఆడపడుచుగా - తమిళ నాట్ట్కే వీట్ట్ పొన్నుగా - కన్నడ గడ్డే కన్న తీరుగా - కేరళ కోరిన గళము వీరుగా ‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై’ అని తానీ దేశంలోనే ఉత్తమ గాయనై అమ్మయై ‘వటపత్ర సాయికి’ లాలిని కొమ్మపై కోయిలై ‘ఇది మల్లెల వేళయని’ ‘గుడివాడ వెళ్లాను’ అని కొంటెగ కూతపెట్టి ‘నిను వీడని నీడను నేనే’నని భయపెట్టి ‘శ్రీరస్తు - శుభమస్తు’ అని జంటలను కలిపి ‘అహ నా పెళ్లంట’ అంటూ తను పలికి సాక్షాత్తూ సావిత్రి స్వరమే అన్నట్టుగా నిజముగా జమునయే పాడేస్తున్నట్టుగా వాణిశ్రీ నుండి మాలాశ్రీ దాకా గాత్రంతో పాత్రలకే ప్రాణం పోసేసి ఎందు పాడినా అందరికీ ఓ బంధువు భావన కలిగించి విందు చేసె మన డెందముకి స్వరబంధము తానే కల్పించి ఒకటుందా రెండున్నాయా ఆమె నోటి పాటలు చెబుతున్నా సరిపోతాయా ఆమె గూర్చి మాటలు ప్రతి పాట నాటుకుపోయే జనుల గుండె గూటిలో ఎంచమంటె మంచివి తరమా... ఇన్ని వేల వీటిలో సినీ సీమ నిర్మించేను సుశీలమ్మ పాటల హారం సుశీలమ్మ నిర్మించేను శ్రోతలకో సాగర తీరం ఆవిడకి పాటే జీవితం - ఆవిడ జీవితం పాటకే అంకితం అందుకే... ఆవిడ పాట శాశ్వతం. -
అనుమానంతో భార్య హత్య
పాతపట్నం : అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని బూరగాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బూరగాం గ్రామంలో యర్లంకి దుర్గారావు కూలి పని చేస్తుంటాడు. మద్యానికి బానిస కావడంతో దుర్గారావుకు, అతని భార్య సుశీల (30)కు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొంతకాలంగా భార్యపై అనుమానంతో ఉన్న అతను శుక్రవారం ఇంట్లో భార్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలో గల పొలాల్లో పడేసి వరిగడ్డితో కప్పేశాడు. అతను అక్కడ సంచరిస్తుండడంతో స్థానికులు అనుమానించడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుశీల హత్య ఉదంతం తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి కుమార్తె చిట్టెమ్మ ఏడాదిన్నర కిందట మృతి చెందింది. కుమారుడు పెంటయ్య ఉన్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సురేష్‌బాబు తెలిపారు. -
అమ్మ వచ్చింది..
వర్షకొండ (ఇబ్రహీంపట్నం), న్యూస్‌లైన్ : బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి.. అక్కడి నిబంధనలతో ఐదు నెలల పాటు జైలులో బందీ అయిన ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన కొంతం సుశీల తన ఐదుగురు పిల్లలతో కలిసి బుధవారం క్షేమంగా ఇల్లు చేరింది. పెళ్లయి.. ఓ కూతురు జన్మించాక.. భర్త నుంచి విడాకులు తీసుకున్న సుశీల 17 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆజాద్ వీసాపై కువైట్ వెళ్లింది. అక్కడ పలు గృహాల్లో పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పరిచయం కాగా వివాహమాడింది. మొదటి కాన్పుకోసం ఇక్కడకు వచ్చి బిడ్డ పుట్టాక ఇక్కడే వదిలి మళ్లీ కువైట్‌కు వెళ్లింది. అక్కడ మరో ఐదుగురికి జన్మనిచ్చింది. మహేశ్వరి, సాయిబాబా, నవీన్‌కుమార్, లయ, స్వప్న ఆమె పిల్లలు. ఈ క్రమంలో అక్కడి నిబంధనల ప్రకారం.. భర్తను స్వదేశానికి పంపించారు. సుశీలను అక్కడి పోలీసులు జైలులో బంధించారు. ఆమెతో ముగ్గురు పిల్లలు జైల్లో, ఇద్దరు బయట ఉండిపోయారు. సుశీల, ఆమె పిల్లల వ్యథను, వర్షకొండలో ఉన్న ఆమె మరో కూతురు వ్యథను ‘సాక్షి’ పలుమార్లు కథనాలుగా ప్రచురించింది. ఐదునెలల అనం తరం పిల్లలతోపాటు ఆమెకూ ఔట్ పాస్‌పోర్టులు ఇచ్చి స్వదేశానికి పంపించారు. విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఆమె.. అక్కడినుంచి ట్యాక్సీ ద్వారా ఇంటికి చేరుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆనం దం వెల్లివిరిసింది. ఎన్నాళ్లయ్యిందమ్మా.. నిను చూసి అం టూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ఆమె వద్దకు వెళ్లగా.. తన కష్టాలను ఏకరువు పెట్టింది. వీసాను రెన్యూవల్ చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో పోలీసులు పట్టుకుని జైల్లో వేశారని, లంచా లు ఇవ్వనిదే మనదేశ రాయబార కార్యాలయం అధికారులు జైల్లో నుంచి విడిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదుకునేవారు లేక తనలాంటి వారెందరో జైల్లో మగ్గుతున్నారని పేర్కొంది. అలాంటివారిని విడిపించేం దుకు ప్రభుత్వం సహకారం అందించాలని విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరింది. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది.