‘మంత్రి ఆంజనేయ క్షమాపణ చెప్పాలి’ | 'Minister Anjaneya should apologize | Sakshi
Sakshi News home page

‘మంత్రి ఆంజనేయ క్షమాపణ చెప్పాలి’

Published Fri, Dec 5 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

‘మంత్రి ఆంజనేయ క్షమాపణ చెప్పాలి’

‘మంత్రి ఆంజనేయ క్షమాపణ చెప్పాలి’

దావణగెరె : గోమాతను పూజించేవారు పూజించవచ్చని, తినేవారు తినవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్.ఆంజనేయ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని అఖిల భారత హిందూ మహాసభకు చెందిన ప్రణవానంద స్వామీజీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేవలం ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుగా లేదని అన్నారు. 

బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రి భారతీయ పరంపరలో గోమాతకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు.  గోమాత గురించి అవహేళనకరంగా మాట్లాడిన ఆంజనేయను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మహాసభ పదాధికారులు ప్రశాంత్, కొట్రేష్, రంగస్వామి, కల్లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement