తిరువనంతపురం : తనపై లైంగిక దాడి ఫిర్యాదును వాపస్ తీసుకుంటే భూమి, బంగళా సహా అన్నీ సమకూరుస్తానని బిషప్ తమను ఫోన్‌లో సంప్రదిస్తున్నాడని కేరళకు చెందిన నన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. నన్‌కు బిషప్ చేసిన ఫోన్‌కాల్ ఆడియోను బాధితులు బహిర్గతం చేయగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. 46 సంవత్సరాల బాధితురాలు జలంధర్ బిషప్ ఫ్రాంకో ముల్లకల్ తనను 2014 నుంచి 2016 మధ్య 13 సార్లు లైంగికంగా వేధించాడని ఆరోపించారు. అయితే ఆమెపై మరో ఐదుగురిపై తనను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని బిషప్ ఫిర్యాదు చేసిన అనంతరం బాధితురాలు పోలీసులను సంప్రదించారు.
కేరళ పోలీసులు ఆయనపై లైంగిక దాడి కేసును నమోదు చేయగా బిషప్ వాదన మరోలా ఉంది. క్రమశిక్షణా చర్యలు తీసుకున్నందుకే తనపై వారు లైంగిక దాడి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నన్‌కు బిషప్ ప్రతినిధి ఫోన్ చేసి కేసును వాపసు తీసుకుంటే వారికి కొంత భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించడంతో పాటు అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని, కేసు ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment