![Kerala Nun Molestation Accused Bishop Tests Coronavirus Positive - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/15/Coronavirus-Positive.jpg.webp?itok=WUS0Bl0n)
తిరువంతపురం: కేరళ నన్ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. సోమవారం నాటి రిపోర్టుల్లో అతనికి వైరస్ సోకినట్లు జలంధర్ నోడల్ ఆఫీసర్ టీపీ సింగ్ దృవీకరించారు. ఆయన లాయర్‌కు కరోనా సోకడంతో బిషప్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంతలో ఫ్రాంకోకు కూడా వైరస్ సోకినట్లు వెల్లడైంది. కాగా కొట్టాయమ్‌లోని స్థానిక కోర్టు ఆయన సరిగా కేసు విచారణకు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో గతంలో జారీ చేసిన బెయిల్‌ను రద్దు చేయడంతోపాటు నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బిషప్‌కు వైరస్ సోకినట్లు తెలిసింది. (ముద్దిస్తా కానీ కొరకకూడదు: పోప్)
మరోవైపు జూలై 1న జరిపిన కోర్టు విచారణకు సైతం ఆయన హాజరవలేదు. పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్నందువల్లే కోర్టుకు రాలేకపోయానని తెలిపారు. కానీ ఆ ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లోనే లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఏకీభవించిన న్యాయస్థానం బిషప్ బెయిల్‌ను రద్దు చేయడమే కాక నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. (‘ఏ కూతురు ఇలాంటి ఆరోపణలు చేయదు’)
Comments
Please login to add a commentAdd a comment