bishap
-
కరోనాతో బిషప్ మృతి, మృతదేహానికి ముద్దులు
పోడ్గోరికా: మాంటెనెగ్రోలో బిషప్ అమ్ఫిలోహిజే రాడోవిక్ పార్థీవదేహాన్ని సందర్శించే సమయంలో చాలా మంది కోవిడ్-19 భద్రతా నియమాలను విస్మరించారు. బిషప్ అమ్ఫిలోహిజే రాడోవిక్ చివరి అంత్యక్రియలను ఆదివారం పోడ్గోరికాలోని సెర్బియన్ ఆర్థోడాక్స్ కేథడ్రాల్లో నిర్వహించారు. అయితే ఆయనను చూడటానికి వచ్చిన వారిలో చాలా మంది ఆయన గౌరవార్థం ఆయన చేతిపై, నుదిటిపై మాస్క్‌లు లేకుండానే ముద్దులు పెట్టారు. ఈ విషయం గురించి బిషప్కు చికిత్సనందించిన డాక్టర్ మాట్లాడుతూ, ముందు ఆయన పార్థీవదేహాన్ని అలా తెరచి పెట్టకుండా నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆయన శరీరంపై కరోనా వైరస్ ఒక పొరలా ఉంటుందని వివరించారు. ఇప్పటికే ఈ చిన్న దేశంలో మూడు వంతుల మంది దాదాపు ఆరు లక్షలకు పైగా కోవిడ్-19 బారిన పడ్డారు. ఇక బిషప్ అమ్ఫిలోహిజే రాడోవిక్ విషయానికి వస్తే ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా ఉన్న డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ సోషలిస్ట్ నేత మిలో జుకానోవిక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గట్టిగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో జరిగే ఎన్నకల ప్రచారంలో డీపీఎస్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. బిషప్ అమ్ఫిలోహిజే, పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకి, మోంటెనిగ్రో నుంచి సెర్బియా విడిపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల ఆయన మాస్క్ లేకుండా తిరిగారు. సామాజిక దూరం పాటించకుండా చాలా మందిని కలిశారు. దీంతో ఆయన కరోనా బారిన పడి శుక్రవారం నాడు మరణించారు. ఇప్పుడు ఆయనకు కడసారి వీడోల్కు పలకడానికి వచ్చిన వారు కూడా కరోనా నియమాలు పాటించకుండా మాస్క్‌లు లేకుండా ఆయన మృతదేహాన్ని తాకుతూ ముద్దులు పెట్టడం చర్చనీయ అంశంగా మారింది. చదవండి: జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఫేజ్-2 పూర్తి -
అత్యాచార కేసు: బిషప్కు కరోనా
తిరువంతపురం: కేరళ నన్ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. సోమవారం నాటి రిపోర్టుల్లో అతనికి వైరస్ సోకినట్లు జలంధర్ నోడల్ ఆఫీసర్ టీపీ సింగ్ దృవీకరించారు. ఆయన లాయర్‌కు కరోనా సోకడంతో బిషప్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంతలో ఫ్రాంకోకు కూడా వైరస్ సోకినట్లు వెల్లడైంది. కాగా కొట్టాయమ్‌లోని స్థానిక కోర్టు ఆయన సరిగా కేసు విచారణకు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో గతంలో జారీ చేసిన బెయిల్‌ను రద్దు చేయడంతోపాటు నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బిషప్కు వైరస్ సోకినట్లు తెలిసింది. (ముద్దిస్తా కానీ కొరకకూడదు: పోప్) మరోవైపు జూలై 1న జరిపిన కోర్టు విచారణకు సైతం ఆయన హాజరవలేదు. పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉన్నందువల్లే కోర్టుకు రాలేకపోయానని తెలిపారు. కానీ ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లోనే లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఏకీభవించిన న్యాయస్థానం బిషప్ బెయిల్‌ను రద్దు చేయడమే కాక నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. (‘ఏ కూతురు ఇలాంటి ఆరోపణలు చేయదు’) -
వైభవంగా గుణదల మేరీమాత ఉత్సవాలు
గుణదల (విజయవాడ తూర్పు): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన విజయవాడ గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడ్రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను పుణ్యక్షేత్ర ప్రధానాలయం దిగువన ఉన్న బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల మాత పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు తదితర గురువులతో కలిసి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. బిషప్ రాజారావు మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా భక్తులు మరియమాతను సందర్శించి ఆమె చల్లని దీవెనలు పొందుతున్నారన్నారు. క్రైస్తవ మత గురువులు భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. కతోలిక పీఠం చాన్సలర్ ఫాదర్ వల్లె విజయజోజిబాబు, సోషల్ సర్వీస్‌సెంటర్ డైరెక్టర్ ఫాదర్ పసల థామస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, ఫాదర్లు పాల్గొన్నారు. -
బిషప్ ఇంటి ముందు యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: బిషప్ నివాసంలోకి వెళ్తున్న యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న బిషప్ నివాసంలోకి వెళ్లేందుకు యత్నిస్తుండగా.. సెక్యూరిటీ గార్డు అతన్ని అడ్డుకున్నాడు. దీంతో జీసెస్నినాదాలు చేస్తూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.