
సాక్షి, ముంబై : నోరా ఫతేహి మనకు పెద్దగా పరిచయం లేని ఈ బిగ్‌బాస్ భామకు డాన్స్ అంటే విపరీతమైన అభిమానం. చాన్స్ ఇస్తే రోజంతా డాన్స్ చేయమన్నా చేస్తుంది. ఈ విషయం నోరా పాత ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. చేసే ప్రతి పనిలోనూ ఆనందం వెతుక్కోవడం ఎలానే ఈ మొరాకో ముద్దుగుమ్మకు బాగా తెలుసు. ప్రస్తుతం ఈ భామ మేకప్ వేసుకుంటూ చేసిన డాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నోరాతో పాటు ఆమె మేకప్ మాన్ కూడా ఉన్నాడు. నోరా ఈ వీడియో గురించి మాట్లాడుతూ తెర మీద మిమ్మల్ని అలరించడానికి ముందు తెర వెనక మేము ఇలా కష్టపడతాము అని చెప్పింది. డాన్స్ చేస్తూనే నోరా తయారయ్యే విధానం చాలా వినోదాత్మకంగా ఉంది.
బిగ్ బాస్ 9లో పాల్గొన్న ఈ భామ తన అందం, సింప్లిసిటి ద్వారా చాలామంది మనసులు గెలుచుకుంది. 2015లో ప్రసారమైన ‘ఝలక్ తిక్లాజా’ రియాలిటి షో ద్వార ఆమెలోని డాన్సర్ ప్రపంచానికి తెలిసింది. నోరాకు కేవలం బెల్లీ డాన్స్‌లోనే కాకుండ ఇతర రకాల డాన్స్‌లలో కూడా ప్రవేశం ఉంది. ఈ మధ్యే ఆమె పోల్ డాన్స్‌ను కూడా నేర్చుకుంది. దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేసింది. నోరా ‘బాహుబలి : ద బిగినింగ్’ చిత్రంలోని ఒక ప్రత్యేక గీతంలో మెరిసింది. రెండు పార్టులుగా వచ్చిన బాహుబలి చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. మొదటిపార్టు ‘బాహుబలి : ద బిగినింగ్’ రెండు జాతీయ స్థాయి అవార్డులను, రెండో పార్టు ‘బాహుబలి2 : ద కన్‌క్లూజన్’ మూడు జాతీయ స్థాయి అవార్డులను అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment