Bahubali Film
-
బాహుబలి భామ వీడియో వైరల్
సాక్షి, ముంబై : నోరా ఫతేహి మనకు పెద్దగా పరిచయం లేని ఈ బిగ్‌బాస్ భామకు డాన్స్ అంటే విపరీతమైన అభిమానం. చాన్స్ ఇస్తే రోజంతా డాన్స్ చేయమన్నా చేస్తుంది. ఈ విషయం నోరా పాత ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. చేసే ప్రతి పనిలోనూ ఆనందం వెతుక్కోవడం ఎలానే ఈ మొరాకో ముద్దుగుమ్మకు బాగా తెలుసు. ప్రస్తుతం ఈ భామ మేకప్ వేసుకుంటూ చేసిన డాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నోరాతో పాటు ఆమె మేకప్ మాన్ కూడా ఉన్నాడు. నోరా ఈ వీడియో గురించి మాట్లాడుతూ తెర మీద మిమ్మల్ని అలరించడానికి ముందు తెర వెనక మేము ఇలా కష్టపడతాము అని చెప్పింది. డాన్స్ చేస్తూనే నోరా తయారయ్యే విధానం చాలా వినోదాత్మకంగా ఉంది. బిగ్ బాస్ 9లో పాల్గొన్న ఈ భామ తన అందం, సింప్లిసిటి ద్వారా చాలామంది మనసులు గెలుచుకుంది. 2015లో ప్రసారమైన ‘ఝలక్ తిక్లాజా’ రియాలిటి షో ద్వార ఆమెలోని డాన్సర్ ప్రపంచానికి తెలిసింది. నోరాకు కేవలం బెల్లీ డాన్స్‌లోనే కాకుండ ఇతర రకాల డాన్స్‌లలో కూడా ప్రవేశం ఉంది. ఈ మధ్యే ఆమె పోల్ డాన్స్‌ను కూడా నేర్చుకుంది. దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేసింది. నోరా ‘బాహుబలి : ద బిగినింగ్’ చిత్రంలోని ఒక ప్రత్యేక గీతంలో మెరిసింది. రెండు పార్టులుగా వచ్చిన బాహుబలి చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. మొదటిపార్టు ‘బాహుబలి : ద బిగినింగ్’ రెండు జాతీయ స్థాయి అవార్డులను, రెండో పార్టు ‘బాహుబలి2 : ద కన్‌క్లూజన్’ మూడు జాతీయ స్థాయి అవార్డులను అందుకుంది. -
ఘనంగా ముగిసిన యానాం ప్రజా ఉత్సవాలు
యానాం: 16వ యానాం ప్రజా ఉత్సవాలు చివరి రోజు సోమవారం పాటల సందడితో ఘనంగా ముగిశాయి. ముగింపు రోజు కావడంతో యానాం పరిసర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ఈ ఉత్సవాలు తిలకించేందుకు తరలివచ్చారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ప్రజా ఉత్సవాల్లో టీవీ, సినీ సంగీత గాయకుల పాటలు అలరించాయి. ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ పాడిన ఫిదా చిత్రంలోని ‘వచ్చెందే’.. అనే పాటకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. బాహుబలి చిత్రంలోని పాటలను సమీరా భరద్వాజ్ పాడి వినిపించారు. సోని, కృష్ణచైతన్య, హనుమ, సాయిశిల్ప తదితరులు పాడిన పాటలు ఆహూతులను అలరించాయి. అనంతరం ప్రత్యేక మ్యాజిక్ కార్యక్రమం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో పుదుచ్ఛేరి ఆరోగ్యశాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కమిషనర్ గౌరీ సరోజ, ఎస్పీ నితిన్ గోహల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న బాహుబలి
జోగిపేట: సంక్రాంతి అంటే చిన్న పిల్లలకు గుర్తొచ్చేది గాలిపటాలే! చిన్నాపెద్ద, మహిళలనే తేడాలేకుండా అందరూ పండగ వేళ పతంగులు ఎగరవేస్తుంటారు. భవనాలపై నిలబడి కుటుంబ సభ్యులతో, స్నేహితులకు కలిసి సంతోషాన్ని పంచుకుంటారు. ఈ నేపథ్యంలో జోగిపేటలో పెద్ద ఎత్తున గాలిపటాలు, చరఖా, దారం, మాంజాల విక్రయాలు జరుగుతున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలైన అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పుల్కల్, కౌడిపల్లి, హత్నూర ప్రాంతాల నుంచి కూడా యువకులు ఇక్కడికి వచ్చి పతంగులు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నట్టు పలువురు తెలిపారు. ఈ సంవత్సరం హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా బొమ్మలతో గాలిపటాలు ఎక్కువగా వచ్చాయి. వీటితో పాటు డోలక్పూర్, బెన్‌టెన్ గాలిపటాలు ఆకట్టుకుంటున్నాయి. రూ.2 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. పతంగులు ఎగరవేయడానికి దారంతో పాటు మాంజాలు కూడా ఉపయోగిస్తారు. చరఖా రూ.750 చొప్పున విక్రయిస్తున్నారు. మద్యం బాటిల్ మాదిరి డబ్బాలలో చరఖా పెట్టి విక్రయిస్తున్నారు. -
బాహుబలి ఫీవర్
సినిమా చూపిస్తున్న ‘బాహుబలి’ - సినిమా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం - ఒకరోజు ముందుగానే టికెట్ల కోసం పడిగాపులు - అడ్వాన్స్ బుకింగ్‌లో ధరలకు రెక్కలు - జిల్లాలో 62 థియేటర్లు ఉంటే 58 థియేటర్లలో నేడు విడుదల - అడ్వాన్స్ బుకింగ్‌లో అత్యధిక ధరలు - ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లులు - బంద్ ఎఫెక్ట్‌తో ‘ఆందోళన’ వనపర్తిటౌన్: మూడేళ్ల నుంచి ఊరించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో వస్తున్న బాహుబలి సినిమా విడుదలకు ముందే థియేటర్ యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో మొత్తం 62థియేటర్లు ఉంటే శుక్రవారం 58 థియేటర్లలో బాహుబలి విడుదల కానుంది. వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, ఆమనగల్లు, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో గత వారం రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ పేర్లతో టికెట్ రేట్లను రెట్టింపు చేసేశారు. రూ.10లు ఉండే లోక్లాస్ టికెట్ నుంచి రూ.50లు ఉండే ఫస్ట్‌క్లాస్ టికెట్లను రూ.60 నుంచి రూ.200వరకు పెంచి అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేశారు. కొన్ని థియేటర్లలో ఏ క్లాసైనా రూ.100లకు అమ్ముతున్నారు. బాహాటంగా టికెట్ ధరలను పెంచిన థియేటర్ యజమానులు తినుబండారాలు, శీతల పానీయాలు సైతం పెంచి, ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టి కాసులు దండుకునేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్‌నగర్‌లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రారంభమవుతుండగా, వనపర్తి, జడ్చర్లలో తెల్లవారుజాము నుంచి ఆటలు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 50వేలకు పైగా టికెట్లు అమ్మినట్లు థియేటర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఒకట్రెండు థియేటర్లలో తప్పా.. మిగిలిన వాటిలో సీట్ల పరిమితికి మించి టికెట్ల అమ్మకాలు చేపట్టారు. మరోవైపు ప్రతి మూడు, ఆరు నెలలకొకసారి అధికారులు తప్పకుండా థియేటర్లను తనిఖీ చేయాల్సి ఉన్నా.. జిల్లాలో ఎక్కడా ఆ పనిచేసినట్లు కనిపించడం లేదు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టవద్దని కేంద్రానికి లేఖ రాసిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి నిరసనగా జిల్లా టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా థియేటర్ యజమానులు ఆందోళనలో పడ్డారు. థియేటర్లకు వచ్చే నేతలకు ఎలాగైనా సర్దిచెప్పాలని కొందరు భావిస్తుంటే, మరికొందరు వారిని మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే జిల్లాలో బంద్ ఎఫెక్ట్ బాహుబలిపై ఎంత ప్రభావం చూపుతుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. రాత్రి నుంచి థియేటర్లోనే... టీఆర్ఎస్ పార్టీ బంద్ ఇచ్చిన నేపథ్యంలో ఎలాగైన తొలి షో చూడాలనే ఆశతో అభిమానులు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచే థియేటర్ల వద్దకు చేరుకున్నారు. వనపర్తిలోని శ్రీరామా థియేటర్ వద్ద గురువారం సెకండ్‌షో సైతం వేయనీయకుండా దాదాపు వెయ్యి మంది అభిమానులు థియేటర్లోకి దూసుకెళ్లి సీట్లలో కూర్చున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మొ దటి ఆట చూసే వెళ్తామని అభి మానులు తేల్చిచెప్పారు. అంతకు ముందు థియేటర్ వద్ద వేరే ప్రాం తం నుంచి వచ్చిన అభిమానుల కోసం థియేటర్ వద్ద భోజనాల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిం చగా, ఒకేసారి వెయ్యి మంది రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు.