ఆకట్టుకుంటున్న బాహుబలి | Sankranthi festival special bahubali kites | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న బాహుబలి

Published Wed, Jan 13 2016 5:06 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

ఆకట్టుకుంటున్న బాహుబలి - Sakshi

ఆకట్టుకుంటున్న బాహుబలి

జోగిపేట: సంక్రాంతి అంటే చిన్న పిల్లలకు గుర్తొచ్చేది గాలిపటాలే! చిన్నాపెద్ద, మహిళలనే తేడాలేకుండా అందరూ పండగ వేళ పతంగులు ఎగరవేస్తుంటారు. భవనాలపై నిలబడి కుటుంబ సభ్యులతో, స్నేహితులకు కలిసి సంతోషాన్ని పంచుకుంటారు. ఈ నేపథ్యంలో జోగిపేటలో పెద్ద ఎత్తున గాలిపటాలు, చరఖా, దారం, మాంజాల విక్రయాలు జరుగుతున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలైన అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పుల్కల్, కౌడిపల్లి, హత్నూర ప్రాంతాల నుంచి కూడా యువకులు ఇక్కడికి వచ్చి పతంగులు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నట్టు పలువురు తెలిపారు.
 
ఈ సంవత్సరం హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా బొమ్మలతో గాలిపటాలు ఎక్కువగా వచ్చాయి. వీటితో పాటు డోలక్‌పూర్, బెన్‌టెన్ గాలిపటాలు ఆకట్టుకుంటున్నాయి. రూ.2 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. పతంగులు ఎగరవేయడానికి దారంతో పాటు మాంజాలు కూడా ఉపయోగిస్తారు. చరఖా రూ.750 చొప్పున విక్రయిస్తున్నారు. మద్యం బాటిల్ మాదిరి డబ్బాలలో చరఖా పెట్టి విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement