
మే‘కప్పు’కుందామిలా..
సాక్షి,వీకెండ్: రెయినీ, వింటర్ సీజన్లలో మేకప్ వేసుకోవడమంటే గగనమనే చెప్పాలి. ఈ కాలాల్లో మామూలు రోజుల్లో కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మాన్‌సూన్‌లో వేసవి సీజన్‌లో కంటే రెట్టింపు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. సిటీలోని ప్రముఖ మాల్స్‌లో బాడీ నీడ్స్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్ లాంటి సీజన్‌కి తగ్గట్టు బాడీ, స్కిన్ టైప్‌కి సంబంధించి వివిధ రకాల క్రీమ్‌లు, జెల్‌లు, మేకప్ ప్రొడక్ట్స్ రూ.100 నుంచి దొరుకుతున్నాయి. వర్షాకాలంలో మేకప్, హెయిర్ కేర్‌కు ఇవి ఉపకరిస్తాయి.
– శిరీష చల్లపల్లి
కన్సీలర్, షాడోస్, ఫౌండేషన్.. ఇలా రకరకాల క్రీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా క్లెన్సర్స్, ఫేస్ క్రీమ్స్, సోప్స్ వంటి వాటిని ముఖానికి వాడుతుంటారు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి పక్కనపెట్టి ఫోమ్ జెల్, ఆయిల్ ఫ్రీ లోషన్స్ ఉపయోగించాలని సిటీలో పేరొందిన మేకప్ నిపుణులు సూచిస్తున్నారు. వీరు చెబుతున్న మరిన్ని సూచనలు..
► ఫౌండేషన్‌లకు, లిప్‌స్టిక్‌లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. అవసరమైతే లిప్ గ్లాస్, బ్రోజింగ్ జెల్ లిప్ షైనర్‌లను వాడొచ్చు. ఇప్పుడు మార్కెట్‌లో స్ట్రాబెర్రీ, గో వా, బ్లూబెర్రీ, వెనీలా, గ్రేప్ వంటి రకరకాల ఫ్లేవర్లలో, రంగులతో సై తం లిప్ గ్లాస్‌లు దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగించొచ్చు. ఇవి ఉపయోగిస్తే ఫ్రెష్‌గా కనపడతారు.
► టింటెడ్ మాయిశ్చరైజర్‌తో మేకప్ వేసుకోవాలి. రకరకాల క్రీమ్‌ల జోలికి పోకుండా పౌడర్ పఫ్ కాస్త తడి చేసి పౌడర్ అద్ది దానితో లైట్‌గా టచ్ అప్ చేసుకుంటే చాలు. అయితే ఎక్కువ వాటర్ అద్దకుండా చూసుకోవాలి. లేదంటే ముఖంపై అచ్చులు కనిపిస్తాయి.
► వాటర్ ప్రూఫ్ ఐ లైనర్, ఐ షాడోస్, మస్కారా, అండర్ ఐ కన్సీలర్ వాడటం మంచిది. ఇవి వర్షానికి గానీ, ఎండకు గానీ కరగకుండా ముఖం తేజస్సుగా అందంగా కనిపించటానికి దోహదపడతాయి.
► మంచి హెయిర్ వాషెస్ లేదా లైట్ హెర్బల్ షాంపూలతో తల స్నానం చేయాలి. కండిషనర్‌ని ఎక్కువగా వాడకూడదు. తల అరబెట్టుకోవడానికి డ్రయర్లు వాడితే మంచిది. వానలో తడిసిన తల అరకుండానే జడ వేసుకోకూడదు. మంచి పెర్ఫూ్యమ్ తో కూడిన హెయిర్ స్ప్రేలు సైతం మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వర్షానికి, తలలోని తేమతో వెంట్రుకల కుదుళ్లు పాడవకుండా ఉండాలంటే డీప్ ఫ్రీజ్ సెరమ్‌లను వాడాలి. వర్షాకాలంలో బయటికి వెళ్లేటప్పుడు చర్మానికి, మేకప్‌కి తగ్గ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.