
సౌత్ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నయనతార. తాజాగా ఆమె కనెక్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలాకాలం తర్వాత మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నయనతార గతంలో ఓ హీరోయిన్ తనపై చేసిన కామెంట్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మాళవిక నయనతారను ఉద్దేశిస్తూ.. 'సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్ ఓ హాస్పిటల్ సీన్ నటించడానికి మేకప్, లిప్‌స్టిక్, హెయిర్‌స్టైల్ ఇలా చక్కగా అలంకరించుకుంది.
చావు బతుకుల్లో ఉన్నప్పుడు అలా అందంగా రెడీ అయి ఎవరైనా సీన్ చేస్తారా?ఎంత కమర్షియల్ సినిమా అయితే మాత్రం కాస్త రియాలిటీకి దగ్గరగా ఉండలి కదా' అంటూ విమర్శించింది. తాజాగా నయన్ మాళవిక చేసిన కామెంట్స్‌పై స్పందించింది.. ''ఆమె పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. ఆసుపత్రి సీన్‌లో నేను మేకప్, హెయిర్‌స్టైల్‌లో కనిపించడం ఆమెకు తప్పుగా అనిపించింది.
సినిమాల విషయంలో రియలిస్టిక్, కమర్షియల్ అనే తేడా ఉంటుంది. రియలిస్టిక్‌గా కనిపిస్తూనే లుక్స్‌పరంగా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్ చిత్రాల్లో దర్శకుడి సూచనల ప్రకారం నటించాల్సి ఉంటుంది. అంతెందుకు యాడ్స్‌లోనూ హీరోయిన్స్‌ను ఇలాగే స్టైలిష్‌గా చూపిస్తారు'' అంటూ మాళవికకు చురకలింటించింది.
Comments
Please login to add a commentAdd a comment