
సవాల్ లాంటి రోల్!
మిల్కీ బ్యూటీ తమన్నా మేకప్ అవసరం లేనంత అందంగా ఉంటారు. కానీ, సినిమా కోసం లైట్‌గా అయినా మేకప్ చేసుకోవాల్సిందే. ఒక్కోసారి ఆ అవసరం కూడా లేని పాత్రలు వస్తుంటాయ్. అప్పుడు మాత్రం నాకు భలే ఆనందంగా ఉంటుందని తమన్నా అంటుంటారు. ఆల్రెడీ తమిళ చిత్రం ‘ధర్మదురై’లో ఈ బ్యూటీ మేకప్ లేకుండా చేశారు.
‘బాహుబలి’లో డీ–గ్లామరైజ్డ్‌గా కనిపించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రభుదేవా సరసన చేయనున్న సినిమాలోనూ డీ–గ్లామరైజ్డ్‌గా కనిపించనున్నారని టాక్. ఇందులో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటించనున్నారు. ఇది సవాల్ లాంటి పాత్ర. తమన్నా ఇలాంటి సవాళ్లను సునాయాసంగా జయించేస్తారని చెప్పొచ్చు. కథానాయికగా దాదాపు పదేళ్ల ఎక్స్‌పీరియన్స్ తమన్నాకి ఉంది. ఆ అనుభవంతో ఈ పాత్రలో జీవించేస్తారని ఊహించవచ్చు.