దయ్యాల్ని భయపెట్టే మేకప్ | Cacodemon also fear to in this makeup | Sakshi
Sakshi News home page

దయ్యాల్ని భయపెట్టే మేకప్

Published Mon, Oct 5 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

దయ్యాల్ని భయపెట్టే  మేకప్

దయ్యాల్ని భయపెట్టే మేకప్

నెట్‌ఇంట్లో
 
వింతైన విడియోలు, గమ్మత్తై పోస్టులు, కత్తిలాంటి కామెంట్లు,  దిమ్మతిరిగించే డిజిటల్ మాయాజాలాల నిలయం నెట్టింట్లోకి మరోసారి లాగిన్ అవుదాం. సోషల్ మీడియా సామ్రాజ్యంలో సెర్చి ఇంజన్ పై నెక్కి సైబర్ సూపర్ హైవేపై పరుగులు తీద్దాం. షార్టు ఫిల్ము, స్మార్ట్‌ఫోను, బుల్లి బాద్షా, భలే మేక ప్ ఉమన్.... కాదేదీ సోషల్‌మీడియాకనర్హం. ఈ వారం పోస్టులు ఫస్టు క్లాసుగా, బెస్టు బెస్టుగా వైరల్ ఫీవర్‌ను
 ప్రపంచానికి అంటిస్తున్నాయి. ఓ లుక్కేయండి మరి!
 
డబుల్ రోటీ బాగుంటుంది. డబుల్ డెక్కర్ బాగుంటుంది. డబుల్ ధమాకా బాగుంటుంది. కానీ డబుల్ కళ్లు, డబుల్‌ముక్కులు, డబుల్ నోళ్లు ఉన్న మనిషి ఉన్నట్టు మన మధ్య ఊడిపడితే......? బెంబేలెత్తిపోతాం. ‘‘బాబోయ్ భూతం’’ అంటాం. పరుగో పరుగు అంటూ పారిపోతాం. ప్రామిస్ ఫాన్ అనే అమ్మాయి సరిగ్గా ఇలాగే కనిపించింది. ఆమెకి డబుల్ రోటీలా రెండు జతల కళ్లు, డబుల్ డెక్కర్ లాగా ముక్కు మీద ముక్కు. డబుల్ ధమాకా ఏమిటంటే ఆమెకి నోరు కింద నోరు. అందాలన్నీ డబుల్ డోసులో ఉన్న ఈ అమ్మడిని చూసి ఊరు ఊరంతా జడుసుకుంది. అయితే ప్రామిస్ ఫాన్ ఇదంతా అమెరికన్ల దయ్యాల పండుగ హాలోవీన్ కోసం చేసుకున్న మేక ప్. ఆమె ఒక మేకప్‌ఆర్టిస్ట్. కాస్సేపు కంగారెత్తించిన ఈ అమ్మడిపై అందరూ ‘‘ిసింగిల్ కాదు.... డబుల్‌బండ పడ!’’ అంటున్నారట.
 https://www.youtube.com/watch?v=edSb4gYR_Bg
 
 ఇట్లు.... మీ ‘అమ్మ’!
ఆ అమ్మాయి, అమ్మ అమ్మాయి అమ్మల్లా ఉండరు. మంచి ఫ్రెండ్స్‌లా ఉంటారు. అమ్మాయి అమ్మను బేటీ అంటుంది. అమ్మ అమ్మాయిని ‘మా‘ అంటుంది. సిటీలో పనిచేస్తున్న అమ్మాయి అమ్మకి ఫోన్‌చేస్తుంది. ‘నేనొక అబ్బాయిని వెతికాను. దీపావళికి  చూపిస్తాను‘ అంటుంది. తండ్రి లేని పిల్ల తన నిర్ణయాలు తానే తీసుకుంటోందని అమ్మ హడావిడి పడుతుంది. అమ్మాయి వస్తుంది. http://img.sakshi.net/images/cms/2015-10/81443992933_Unknown.jpgఅమ్మకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు గాజులు తెస్తుంది. వేసుకొమ్మంటుంది. ఆకుపచ్చ రంగు దుపట్టా తెస్తుంది. బలవంతంగా అమ్మ చేత వేయిస్తుంది. ‘ఏంటీ హడావిడి? పెళ్లి చూపులు నాకా నీకా?‘ అంటుంది అమ్మ చిరుకోపంతో. ‘నీకే’ అంటుంది అమ్మాయి. తల్లి నిర్ఘాంతపోతుంది. ‘ఎప్పుడో ఒకప్పుడు నేను వెళ్లిపోతాను. నీ గురించి ఆలోచిస్తూంటే నాకు బెంగగా ఉంటుంది‘ అంటుంది ఆ అమ్మాయి. అమ్మాయి అమ్మ అయి అమ్మకు మళ్లీ బతుకునిచ్చేందుకు చేసే ఈ ప్రయత్నం ఆరంటే ఆరు నిమిషాల షార్ట్ ఫిలిం ‘తుమ్హారీ అమ్మా‘. ఆ తరువాత ఏమవుతుంది? ఆ... అంతా చెప్పేస్తారు మరి! ఈ ఆరు నిమిషాల అద్భుతం... నె ట్‌తెరపై విడుదల.... నేడే చూడండి!
 https://www.kulzy.com/work/92395/omron/film/tumhaari-amma/#_=
 

నవ్వేరియా వ్యాధి
ఆవులింతకి అన్నలుంటారట. తుమ్ముకి తమ్ముళ్లుంటారట. మరి నవ్వుకి..... ? నవ్వుకి నలుగురు... కాదు కాదు... నలభై మంది.... http://img.sakshi.net/images/cms/2015-10/71443993054_Unknown.jpgకాదు కాదు నాలుగొందల మంది నేస్తాలుంటారు. కావాలంటే ఈ విడియో చూడండి. రైల్లో ఒకమ్మాయి సెల్‌ఫోన్ మెసేజీ చూసి నవ్వుకుంది. ఆ నవ్వు నెమ్మదిగా ఒకరికి, వారినుంచి ఇంకొకరికి .... ఇలా మొత్తం కంపార్ట్‌మెంటుకి పాకిపోయింది. కళ్లకి కంజక్టివైటిస్‌లా, వొంటికి వైరల్‌ఫీవర్ లా పెదవి నుంచి ఇంకో పెదవికి నవ్వు పాకిపోయింది. ఇక రైలంతా అహ్హహ్హ ఇహ్హిహ్హి! 1962 లో టాంజానియాలో ఇలా నవ్వు అంటువ్యాధి ప్రబలి ఏకంగా 14 స్కూళ్లకు సెలవిచ్చేశారట. ఇది అలాంటిదా? లేక ఏదో ఫ్లాష్ మాబ్ చేసిన ‘‘నవ్వు నవ్వించు’’ ట్రిక్కా అన్నది ఇంకా తేలలేదు. కానీ విడియో మాత్రం ఓహ్హోహ్హొఅంటూ నవ్వులు పంచేస్తోంది. నవ్వు నాలుగు విధాల చేటు కాదు. నాలుగు అందాల మేలు అంటోంది. http://whatstrending.com/funny/20304-contagious-laughter-on-subway-flashmob
 
బుల్లి డాక్టర్ - పెద్ద సెలెబ్రిటీ
రోబోలో రజనీకాంత్ కానుపు చేశాడు. గొప్పేముంది? రజనీ ఏైదైనా చేయగలడు. త్రీ ఈడియట్స్‌లో ఆమిర్ ఖాన్ మంత్రసాని తనం చేశాడు. http://img.sakshi.net/images/cms/2015-10/41443993124_Unknown.jpgగొప్పేముంది? ఆ సినిమాలో అతను చదవకుండానే ఫస్ట్ వచ్చేస్తాడు. పైగా అతనిది ప్రాక్టికల్ నాలెడ్జి. అయితే పదకొండేళ్ల పిల్లాడు కానుపు చేయడం మాత్రం ఖచ్చితంగా గొప్పే! అందునా తన తల్లికే మంత్రిసానితనం చేయడం, తన తమ్ముడిని తన చేతులతో తానే భూమ్మీదకు రప్పించడం సామాన్యమైన సంగతి కానేకాదు. అమెరికాలోని జార్జియాలో కెన్యార్దా అనే మహిళకు ఉన్నట్టుండి నొప్పులు వచ్చాయి. తోడుగా పదకొండేళ్ల జేమ్స్‌డ్యూక్ తప్ప మరెవరూ లేరు. అయితే జేమ్స్ ఏ మాత్రం కంగారు పడలేదు. 911 (మన 108 లాంటి సేవ)కి ఫోను చేశాడు. వాళ్లు ఫోన్‌లో ఏం చేయాలో చెప్పారు. బుడ్డోడు డాక్టర్‌లా బుద్ధిగా అదే చేశాడు. ‘నా తల్లి బాగుండాలి. నా తమ్ముడు బాగుండాలి‘ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే తల్లీ బిడ్డా క్షేమం. మన చిన్న డాక్టర్ డ్యూక్ ఇప్పుడు పెద్ద సెలెబ్రిటీ! http://www.sakshipost.com/index.php/news/international/63885-11-year-old-boy-helps-mom-deliver-baby-brother-at-home.html? psource=Feature
 
 
లాంగ్‌లివ్ ఫేస్‌బుక్!!
 తప్పిపోయిన వారి కోసం ఇదివరలో అంజనం వేసేవారు. సోది చెప్పించుకునేవారు. ఇప్పుడు అవేవీ అక్కర్లేదు. సోషల్ మీడియా ఉంటే చాలు. ఖండాంతరాలు, సముద్రాలకు అటూ ఇటూ ఉన్నా ఫేస్‌బుక్ వారధిలా కలిపేస్తుంది. ఆమాందా స్కార్పినెట్టి, సూసన్ బెర్జర్‌ల http://img.sakshi.net/images/cms/2015-10/41443993175_Unknown.jpgకలయిక అందుకు నిదర్శనం. 38 ఏళ్ల క్రింద వేపరైజర్ మీద పడి అమాందా ఒళ్లంతా కాలిపోయింది. అప్పుడామెకి మూడు నెలలు. ఒళ్లంతా గాజు గుడ్డల బ్యాండేజీతో నెలలపాటు ఆమె ఆస్పత్రి లో ఉంది. ఆ సమయంలో ఒక నర్సు చల్లని చేయి, చక్కని మనసుతో నవనీతం అద్దినంత ప్రేమగా ఆమెను చూసుకుంది. ఆమె ఒడి స్పర్శ అమాందాకు ఎక్కడ లేని ప్రశాంతినిచ్చింది. ఆ సమయంలోనే అమాందాను ఆ నర్సు ఎత్తుకున్న ఫోటోని ఒక ఫోటోగ్రాఫర్ తీశాడు. ఆ తరువాత ఎవరి దారి వారిది. కానీ అమాందా మనసులో ఎదో తెలియని వెలితి. మళ్లీ ఆ చల్లని మనసున్న మనిషిని కలవాలని తీరని కోరిక. కానీ పేరు తెలియదు. ఊరు తెలియదు. ఆ నర్సు ఎక్కడుందో తెలియదు. ఏమైపోయిందో తెలియదు. ఒళ్లంతా కట్లతో ఉన్న తనను ఎత్తుకున్న నర్సు ఫోటోను పెట్టి ఫేస్‌బుక్‌లో ఈపీల్ చేసింది. ఆశ్చర్యం.... సరిగ్గా రెండే రెండు రోజుల్లో ఆ నర్సు పేరు సూసన్ బెర్జర్ అని వెల్లడైంది. 38 ఏళ్ల తరువాత వారి కలయికను టీవీలు లైవ్ లు ఇచ్చాయి, పత్రికలు వార్తలు వ్రాశాయి. అమెరికా ఆనందపడిపోయింది. ప్రపంచం పరవశించిపోయింది. ముఖాలు కూడా తెలియని ఇద్దరిని ముఖపుస్తకం కలిపింది. లాంగ్‌లివ్ ఫేస్‌బుక్!! <http://abcnews.go.com/Lifestyle/wireStory/woman-burned-baby-tracks-nurse-cared-34123532>
 
 
 హా‘రన్’ రాజా రన్

 రోడ్డెక్కితే వాళ్లది రన్. మనది హారన్.... వాళ్లు యమ స్పీడుగా వెళ్తారు. కానీ యాక్సిడెంట్లు మనం చేస్తాం. వాళ్లకి వాహనాలెక్కువ. కానీ ట్రా‘ఫికర్’ మనకే ఎక్కువ. వాళ్ల రోడ్లపై పాదచారే ప్రభువు. మనకి పాదచారి పనికిమాలిన వాడు. వాళ్లు రోడ్‌రూల్ విషయంలో మాట తప్పరు. మనం యాక్సిలరేటర్ నొక్కితే మడమ తిప్పం. రోడ్‌పై వాళ్లు దారి ఇస్తారు. మనం దారిని రక్తాల గోదారి చేస్తాం. ఇల్లాజిక ల్ ఇండియన్ల ట్రాఫిక్ క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ లాజిక ల్ ఇండియన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఒక విడియో పోస్టు చేశాడు. ఇండియాని, అమెరికానీ పోల్చి చూపించాడు. ‘మనోళ్లు ఉత్తి వెధవాయలోయ్‌‘ అన్నాడు. తమాషా ఏమిటంటే అమెరికాలో టాక్సీ డ్రైవర్లు ఎక్కువ మంది భారతీయులే. వాళ్లు ట్రాఫిక్ క్రమశిక్షణకి మారుపేరు. యాక్సిడెంట్లు చేయరని మరో పేరు. ఇంట ఈగల మోత, బయట పల్లకిమోత అయిన భారతీయ డ్రైవర్లపై లాజిక ల్ ఇండియన్ చెణుకుల్ని చూసి తీరాల్సిందే.....
 <https://www.facebook.com/logical.indian/videos/709393972523658/?fref=nf>
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement