పెళ్లి మేకప్‌ ఎలా? | How to Make Wedding Makeup | Sakshi
Sakshi News home page

పెళ్లి మేకప్‌ ఎలా?

Published Fri, Apr 6 2018 12:13 AM | Last Updated on Fri, Apr 6 2018 12:13 AM

How to Make Wedding Makeup - Sakshi

వేసవిలో మేకప్‌కి దూరంగా ఉన్నప్పటికి వివాహ వేడుకలకు తప్పనిసరి అవుతుంది. ఇలాంటప్పుడు మేకప్‌ త్వరగా డల్‌ అవకుండా, ఎక్కువసేపు ముఖం తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ముందుగా ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఐస్‌ క్యూబ్‌తో ముఖమంతా ఒకసారి మృదువుగా రబ్‌ చేసి, కాటన్‌తో తుడిచేయాలి. తర్వాత ముడతలు, నల్లని మచ్చలు, కళ్లకింద నల్లని వలయాలు, నోటికిరువైపులా ఏర్పడ్డ లాఫింగ్‌ లైన్స్‌ కవర్‌ చేయడానికి లిఫ్టింగ్‌ సీరమ్‌ వాడాలి. ఆ తర్వాత ప్రైమర్‌ ఉపయోగించి, ముఖమంతా కలిసేలా బ్రష్‌తో బ్లెండ్‌ చేయాలి. పూర్తయిన తర్వాత వాటర్‌ప్రూఫ్‌ కన్సీలర్‌ను వాడాలి.  చర్మతత్వం ప్రకారం ఎంపిక చేసుకున్న వాటర్‌ ప్రూఫ్‌ ఫౌండేషన్‌ను ఉపయోగించాలి. అంతా కలిసేలా పై నుంచి కిందకు బ్రష్‌తో బ్లెండ్‌ చేయాలి.  తర్వాత పైన కంపాక్ట్‌ పౌడర్‌ను ఉపయోగించాలి.స్ప్రే బాటిల్‌లో కొద్దిగా నీళ్లు పోసి, ముఖం మీద స్ప్రే చేయాలి. స్పాంజ్‌తో అక్కడక్కడా రబ్‌ చేస్తూ కొద్దిగా డార్క్‌ చేయాలి. దీంతో కన్సీలర్, కాంపాక్ట్, ఫౌండేషన్‌ కలిపి సెట్‌ అయిపోతుంది. చెమట పట్టినా, నీళ్లు పడినా మేకప్‌ చెడిపోదు. 

ఫౌండేషన్‌ సెట్‌ అయ్యాక కంటి భాగాన్ని తీర్చిదిద్దాలి. కంటి చుట్టూ న్యూడ్‌ కలర్‌ బేస్‌ రాసి, వేసుకున్న దుస్తుల రంగును బట్టి కంటి పైభాగంలో 2–3 షేడ్స్‌ రెప్పలకు వాడచ్చు. కనుబొమల కింది భాగంలో లైట్‌ షేడ్‌ వాడి, కనుబొమలను తీర్చిదిద్దాలి. తర్వాత కళ్లకి ఐ లైనర్, మస్కారా, కనుబొమలకు ఐ బ్రో పెన్సిల్‌తో మేకప్‌ పూర్తి చేయాలి. బుగ్గల మీద బ్లష్‌ చేసి, పెదవులకు లిప్‌స్టిక్‌ వేయాలి. ముందు లిప్‌ పెన్సిల్‌తో ఔట్‌లైన్‌ గీసి, తర్వాత వాటర్‌ప్రూఫ్‌ లిప్‌స్టిక్‌లో నచ్చిన రంగు ఎంచు కోవాలి. ముక్కు లావుగా ఉన్నా, డబుల్‌ చిన్‌ ఉన్నా డార్క్‌ షేడ్స్‌ వాడి ఫేస్‌ కరెకన్స్‌ చేసుకోవాలి. కరెక్షన్స్‌కైతే నిపుణుల సలహా తప్పనిసరి.. 
ఈ మేకప్‌ 5–6 గంటల వ్యవధిలో తీసేయడానికి మేకప్‌ రిమూవర్‌ని మాత్రమే ఉపయోగించాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని కడిగి, మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement