
వేసవి మేకప్...
అందమె ఆనందం
ఎండ, చెమట వల్ల ఈ కాలం మేకప్ చేసుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వేడుకలలో అందంగా కనిపించాలంటే మేకప్ తప్పనిసరి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో కూడా సింపుల్ మేకప్‌తో అందంగా మెరిసిపోవచ్చు.
⇒ ముందుగా ముఖాన్ని లిక్విడ్ సోప్‌తో శుభ్రపరుచుకోవాలి. తర్వాత తడి లేకుండా తుడుచుకుని ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా 5-6 సార్లు మృదువుగా రబ్ చేయాలి. తర్వాత వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ను ముఖమంతా రాయాలి. ఇలా చేయడం వల్ల మేకప్ ఎక్కువ సేపు ఉండటమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.
⇒ మేకప్ చేయడానికి ముందు నాణ్యమైన ప్రైమర్ లోషన్‌ని ఎంచుకోవాలి. ఇది మేకప్‌కి బేస్‌గా పనిచే స్తుంది. ప్రైమర్‌ను వాడటం వల్ల మేకప్ మచ్చలుగా కనిపించదు. కంటి పై రెప్పకు కంటి చుట్టూతా కూడా ప్రైమర్‌ను అప్లై చేయాలి.
⇒ లిక్వ్‌డ్ బేస్డ్ ఫౌండేషన్‌ను బ్రష్‌తో ముఖమంతా రాయాలి.
⇒ లిప్‌స్టిక్ ప్యాచ్‌లుగా పెదవులపై కనపడకుండా, చేతులకు అంటుకోకుండా ఉండాలంటే టిష్యూపేపర్‌పైన కొద్దిగా పౌడర్‌వేసి, పెదవులపై అద్దాలి.
⇒ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి.
వేసవి కాబట్టి తరచూ నీళ్లు, పండ్లరసాలు తాగుతూ ఉంటే చర్మం త్వరగా పొడిబారకుండా ఉంటంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి మేకప్ చేసుకుంటే వేడుకలో అందంగా మెరిసిపోతారు.
- సౌమ్య జాదవ్, బ్యూటీషియన్