
మేకప్‌ను తుడుచుకోవడానికి వాడే మేకప్ వైప్స్ వల్ల చర్మానికి ఎలాంటి మేలూ లేక పోగా, హాని ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తరచుగా వాడితే, చర్మంపై సహజంగా ఉండే తేమ మాయమై చర్మం త్వరగా పొడిబారిపోతుందని, ముఖంపై త్వరగా ముడుతలు ఏర్పడతా యని బ్రిటన్‌కు చెందిన ఈస్తటీషియన్ జోవానా వర్గాస్ చెబుతున్నారు.
చర్మంపై పేరుకు పోయిన మురికిని, మృతకణాలను ఈ వైప్స్ కొంతవరకు తొలగించగలిగినా, పూర్తిగా శుభ్రం చేయవట. చర్మ ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా మేకప్‌ను తొలగించు కోవాలనుకుంటే మేకప్ వైప్స్‌కు బదులుగా తేలికపాటి సబ్బు, చన్నీటితో శుభ్రం చేసుకోవడమే మేలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment