
న్యూఢిల్లీ: ధనాధన్ ఆటతో క్రికెట్‌కు దూరమైన ధోని అభిమానులకు ఓ పాత వీడియో కొంత ఊరటనిస్తోంది. అతని గారాల తనయ జీవాతో తను తీర్చుకునే అచ్చట, ముచ్చట సామాజిక మాధ్య మాల్లో ధోని పంచుకుంటాడు. అయితే ధోనికి జీవా మేకప్ వేసే ఈ వీడియో మాత్రం అతను షేర్ చేయ లేదు. అతని మేకప్ ఆర్టిస్ట్ సప్న భవ్నానీ ఈ పాత వీడియోను పోస్ట్ చేసింది. జీవా తన చిట్టిపొట్టి చేతులతో తండ్రికి మెరుగులు దిద్దింది. ‘అందరికీ ముద్దొచ్చే మేకప్ ఇది.
దీంతో నా ఉద్యోగానికి (మేకప్ ఆర్టిస్ట్) త్వరలోనే ఎసరొచ్చేలా ఉంది! మహి... మిస్ యూ దోస్త్’ అని ట్వీట్ చేసింది. ఇదిలావుండగా మాయదారి మహమ్మారి ప్రాణాల్ని తోడేస్తోంది. అలాగే ఎందరో ఆశల్ని చిదిమేస్తోంది. ఇప్పుడు ధోని అభిమానుల పట్ల అదే పని చేసింది. గత ప్రపంచకప్ సెమీస్ తర్వాత మాజీ కెప్టెన్ మహి మళ్లీ బరిలోకి దిగలేదు. కనీసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అయినా ఆడలేకపోతాడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ కరోనా వైరస్ లీగ్‌ను జరగనివ్వడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment