
రాంచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఊరట లభించింది. అతని తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌సింగ్‌లు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నెల 20 నుంచి చికిత్స వీరు పొందుతున్నారు. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్ధిరంగా ఉండడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అందులో వీరికి కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ధోని తల్లిదండ్రలకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు, ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు తెలిపారు. దీంతో బుధవారం రాత్రి వాళ్లను డిశ్చార్జ్ చేశారు .
ఈ నెల 20న ధోని తల్లిదండ్రులకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాంచీలోని పూలే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. వారి ఆక్సిజన్ లెవల్స్ స్థిరంగా ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని ఏప్రిల్ 21న అక్కడి వైద్యులు వెల్లడించారు. ధోని తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తెలిసినప్పుడు అతడు ముంబైలో ఉన్నాడు. రాంచీలో తన తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకుంటున్నట్లు ధోని గత వారం తనతో చెప్పినట్లు సీఎస్‌కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు.
( చదవండి: తండ్రికి కరోనా పాజిటివ్.. ఐపీఎల్ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు )
Comments
Please login to add a commentAdd a comment