
ఒక సినిమా నటికి మేకప్‌కు మించిన కవచం ఉండదు. జీవితంలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని కష్టసుఖాలు చూసినా, ఎన్ని ట్విస్ట్‌ల గుండా జర్నీ సాగినా ఫైనల్లీ మళ్లీ కొత్త జీవితం సాగించాలంటే మేకప్‌కు మించిన ఆయుధమూ ఉండదు.లిజీ గుర్తుందా? ఎయిటీస్‌లో స్క్రీన్ మీద ఒక వెలుగు వెలిగిన టాప్ స్టార్. ‘మగాడు’లో రాజశేఖర్ పక్కన, ‘21వ శతాబ్దం’లో సుమన్ పక్కన చాలా హిట్స్ కొట్టింది. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన లిజీ దర్శకుడు ప్రియదర్శన్‌ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై కొట్టింది.
24 ఏళ్ల పాటు కాపురం చేశాక ఇటీవలే విడాకులు తీసుకుంది. కూతురు లావణ్య హీరోయిన్‌గా అఖిల్ నటిస్తున్న ‘హలో’లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడు. చెన్నైలో స్థిరపడ్డ లిజీ మళ్లీ కొత్త జీవితం కోసం ముఖానికి మేకప్ వేసుకుంది. అదీ మన తెలుగు సినిమా తోనే. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నిర్మాత లుగా వ్యవహరిస్తున్న నితిన్ సినిమాలో లిజీ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తోంది. ‘న్యూయార్క్‌లో మొదటిసారిగా ఈ షూట్‌లో పాల్గొన్నాను. చాలా నెర్వస్‌గా అనిపించింది. ఆ తర్వాత మామూలైపోయింది. నాది ఈ సినిమాలో మంచి పాత్ర’ అని లిజీ అంది. అమ్మ పాత్రలు చేసేవాళ్లు రొటీన్ అయినప్పుడల్లా కొత్త అమ్మను ఇండస్ట్రీ పుట్టిస్తుంటుంది. ఈ కొత్త అమ్మతో మరికొన్ని మంచి పాత్రలు మెరుస్తాయని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment