
మేకప్ ప్యాచ్‌లు కనిపించకుండా...
వయసు పై బడటం వల్ల చర్మం ముడతలు పడుతుంటుంది. మెడ, గొంతు ప్రాంతంలో చర్మం ముడతలు పడడాన్ని, చారికలు రావడాన్ని గమనించవచ్చు. ఈ సమస్య నివారణకు మెడ వ్యాయామం చాలా అవసరం. ఆకాశాన్ని చూస్తున్నట్టుగా తల పైకి ఉంచి, తిరిగి కిందకు దింపాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి.
ఇలా రోజులో 5-6 సార్లు చేస్తూ ఉంటే మెడ దగ్గర చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే మెడ, గొంతు దగ్గర మేకప్ వేసుకోవడానికి ముందు ఇలా చేయడం వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించకుండా జాగ్రత్తపడవచ్చు.