![Massive Fire Accident In A Residential Tower At Sharjah - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/6/Massive-Fire-Accident-Sharj_0.jpg.webp?itok=29WKVFH4)
షార్జా: షార్జాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అల్ నహ్ డ్ ప్రాంతంలోని 49అంతస్తుల అబ్కో టవర్ లో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. పదో అంతస్తులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకూ వ్యాపించాయి. దీంతో ఫ్లాట్స్ లో ఉన్న స్థానికులు బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు 3 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ఈ బిల్డింగ్ లో 250 కుటుంబాలు నివాసముంటుండగా.. ఎక్కువ మంది భారతీయులేనని తెలుస్తోంది. ఘటనలో ఏడుగురు గాయపడగా.. వారిని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో విలువైన వస్తువులు, నగదు కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అక్కడి ప్రభుత్వం విచారణ జరుపుతోంది.
చదవండి:
బాయ్స్ లాకర్ రూం: హైకోర్టు సీజేకు లాయర్ లేఖ
ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను
Comments
Please login to add a commentAdd a comment