షార్జా వేదికగా యూఏఈతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి పసికూనపై ప్రతాపం చూపింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. విండీస్ స్పిన్నర్లు కెవిన్ సింక్లెయిర్ (4/24), కారియ (2/34) మాయాజాలం ధాటికి 36.1 ఓవర్లలో 184 పరుగులకు చాపచుట్టేసింది.
యూఏఈ ఇన్నింగ్స్‌లో భారత సంతతి ఆటగాడు అరవింద్ (70) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ ముహమ్మద్ వసీం (42), రమీజ్ షెహజాద్ (27), అలీ నసీర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. అలిక్ అతనాజే (45 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), షామారా బ్రూక్స్ (39), రోస్టన్ ఛేజ్ (27 నాటౌట్) రాణించడంతో మరో 89 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యూఏఈ బౌలర్లలో అయాన్ అఫ్జల్, ముహమ్మద్ జవాదుల్లా, కార్తీక్ మెయ్యప్పన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో విండీస్ ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.
అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టి..
విండీస్ ఓపెనర్ అలిక్ అతనాజే వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టి సాధించాడు. అతనాజే 26 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) పేరిట ఉండిన రికార్డును సమం చేశాడు. టీమిండియాకే చెందిన మరో బ్యాటర్ ఇషాన్ కిషన్.. తన వన్డే అరంగేట్రంలో 33 బంతుల్లో ఫిఫ్టి చేశాడు.
చదవండి: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment