![Indian Arrested In Sharjah For Abusing Wife - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/14/shar.jpg.webp?itok=NTgoJrUK)
షార్జా: భర్త వేధింపులను భరించలేని ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా తన మనో వేదనను పంచుకుంది. భర్త రోజూ వేధిస్తున్నాడని, తనకు సహాయం కావాలంటూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. వెంటనే ఈ విషయంపై స్పందించిన పోలీసులు బుధవారం సదరు మహిళ భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటన యూఏఈలోని షార్జాలో చోటుచేసుకుంది. వివరాలు.. భారత్ చెందిన జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళకు మహ్మద్ ఖిజార్ ఉల్లా(47) అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఉద్యోగరీత్యా షార్జాలో స్థిరపడ్డ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యామని, తనపై హింసాత్మకంగా దాడి చేస్తున్నాడని నవంబర్ 12న ఓ వీడియోను ట్వీట్ చేసింది. అంతేగాక తమ పాస్‌పోర్టులను, బంగారాన్ని లాక్కొన్ని చిత్ర హింసలు పెడుతున్నాడని ఆమె వాపోయింది. భర్త నుంచి తనను, పిల్లలను రక్షించి సొంత ఊరు అయిన బెంగుళూరుకు పంపాలని అభ్యర్థించింది. తనకు ఇక్కడ(షార్జా)లో తెలిసిన వారు ఎవరూ లేరని పోలీసులను వేడుకుంది. ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్ ఖిజార్ ఉల్లాను విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment