
వాంగరీ: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న న్యూజిలాండ్ వన్డేల్లోనూ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లెవిస్ (76), పావెల్ (59) అర్ధ సెంచరీలు సాధించారు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (16) విఫలమయ్యాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రేస్‌వెల్‌కు 4 వికెట్లు దక్కాయి.
అనంతరం న్యూజిలాండ్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసింది. హెరిక్ వర్కర్ (57), టేలర్ (49 నాటౌట్), మున్రో (49) కివీస్‌ను గెలిపించారు. ఈ ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యం సాధించింది. రెండో వన్డే శనివారం క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment