taylor
-
వెలాసిటీదే విజయం
జైపూర్: పురుషుల ఐపీఎల్ తరహాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో ఉత్కంఠకు మాత్రం కొదవ ఉండటం లేదు. స్కోర్లు తక్కువైనా సోమవారం ట్రయల్ బ్లేజర్స్–సూపర్ నోవాస్ జట్ల మ్యాచ్ చివరి బంతి వరకు సాగి ఆసక్తి రేపగా... బుధవారం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో అనూహ్య ఫలితం వచ్చేలా కనిపించింది. వెలాసిటీ విజయానికి 20 బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరమైన స్థితిలో... ఏడు బంతుల్లో ఒక్క పరుగూ రాకుండా ఐదు వికెట్లు పడటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్సుకత నెలకొంది. అయితే, సుశ్రీ ప్రధాన్ (2) అందుకు అవకాశం ఇవ్వకుండా లాంఛనాన్ని పూర్తి చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. వెలాసిటీ 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. హర్లీన్... మళ్లీ గత మ్యాచ్‌లో చెలరేగిన కెప్టెన్ స్మృతి మంధాన (10) ఈసారి త్వరగానే వెనుదిరగడంతో బ్లేజర్స్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సుజీ బేట్స్ (22 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (40 బంతుల్లో 43; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సుజీ ఔటవడం, హర్లీన్‌కు ఎక్కువగా స్ట్రయికింగ్ రాకపోవడంతో స్కోరు వేగం పుంజుకోలేదు. స్టెఫానీ టేలర్ (18 బంతుల్లో 5) బంతులు వృథా చేసింది. 18వ ఓవర్లో హర్లీన్, దీప్తి శర్మ (16) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో మెరుగైన స్కోరుకు అవకాశం లేకపోయింది. వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిష్త్ (2/13), అమేలీ కెర్ (2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు. శిఖా పాండే (1/18) పొదుపుగా బౌలింగ్ చేసింది. అనంతరం టీనేజ్ ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ డానియల్ వ్యాట్ (35 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్) మెరుపులతో వెలాసిటీ ఛేదన సులువుగానే సాగింది. రెండో వికెట్‌కు వీరు 38 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద షఫాలీ ఔటయ్యాక వ్యాట్, కెప్టెన్ మిథాలీ రాజ్ (22 బంతుల్లో 17; 1 ఫోర్) ఇన్నింగ్స్‌ను నడిపించారు. మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. గెలుపునకు 25 బంతుల్లో 2 పరుగులే కావాల్సిన దశలో దీప్తి శర్మ (4/14) మాయాజాలానికి వ్యాట్, వేద కృష్ణమూర్తి (0), మిథాలీ, శిఖా పాండే (0), కెర్ (0) ఒకరివెంట ఒకరు వెనుదిరిగారు. దీంతో జట్టు 111/2 నుంచి 111/7కు పడిపోయింది. చేతిలో మూడు వికెట్లుండగా సమీకరణం 13 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఒత్తిడిని తట్టుకున్న ప్రధాన్... దీప్తి వేసిన బంతిని షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా పంపి వెలాసిటీని గెలిపించింది. నేడు వెలాసిటీ, సూపర్ నోవాస్ మ్యాచ్ ఫైనల్ సహా మొత్తం నాలుగు మ్యాచ్‌ల మహిళల టి20 లీగ్‌లో గురువారం వెలాసిటీ, సూపర్నోవాస్ మధ్య మూడో లీగ్ మ్యాచ్ జరుగనుంది. ప్రస్తుతం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ చెరో మ్యాచ్ నెగ్గి ఉన్నాయి. మూడింటిలో బ్లేజర్స్ (–0.305), నోవాస్ (–0.1) కంటే వెలాసిటీ (0.678) రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. గురువారం వెలాసిటీ గెలిచినా, ఓడినా ఫైనల్‌కు వెళ్లే చాన్స్ ఉంది. నోవాస్‌కు మాత్రం విజయం, మంచి రన్‌రేట్ సాధించడం కూడా ముఖ్యమే. 15 ఏళ్ల సంచలనం... బ్లేజర్స్, వెలాసిటీ మ్యాచ్‌లో బరిలో దిగిన షఫాలీ వర్మ వయసు కేవలం 15 ఏళ్లు. హరియాణాకు చెందిన ఈ టీనేజర్ అండర్–19 స్థాయిలో అదరగొట్టే ప్రదర్శన కనబరుస్తోంది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఈమె ఇటీవల జరిగిన బీసీసీఐ అండర్–19 మహిళల క్రికెట్ లీగ్‌లో విశేషంగా రాణించింది. బెంగాల్‌పై 57 బంతుల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌పై 58 బంతుల్లో 98 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్‌పై అయితే 77 బంతుల్లోనే 125 పరుగులు చేసింది. ఈ మూడుసార్లూ జట్టు గెలవగా ఈమెనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’. ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసింది. ఆఫ్‌బ్రేక్ బౌలింగ్‌తో వికెట్ కీపింగ్ కూడా చేయగలగడం షఫాలీ ప్రత్యేకత. షఫాలీ ఇదే జోరును కొనసాగిస్తే మహిళల జాతీయ జట్టులోకి రావడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు. -
టేలర్ కుమార్‌గారి టైమ్ ఆటో!
‘‘టైమ్ ఆటో... టైమ్ ఆటో’’ చౌరస్తాలో తన ఆటో పక్కన నిల్చొని అరుస్తున్నాడు ఎలిజబెత్ టేలర్ కుమార్. ఈయన పేరు గురించి కొద్దిగా చెప్పుకుందాం...టేలర్ కుమార్ తండ్రి టెక్కు సోమలింగం... హాలీవుడ్ అందాల రాశి ఎలిజబెత్ టేలర్‌కు వీరాభిమాని. తనకు కూతురు పుడితే ‘ఎలిజబెత్ టేలర్’ అని పేరు పెడతానని శపథం చేశాడు. కానీకొడుకు పుట్టాడు. అయినప్పటికీ... ఎలిజబెత్ టేలర్ చివర కుమార్ అని చేర్చి తన శపథం నెరవేర్చుకున్నాడు.ఇప్పుడు మళ్లీ ‘టైమ్ ఆటో’ దగ్గరికి వద్దాం.‘‘కొత్తగా ఈ టైమ్ ట్రావెల్ ఆటో ఏందిరో... అంటే ఎక్కడా లేట్ చేయకుండా టైమ్‌కు తీసుకెళ్లే ఆటోనా ఏంది?’’ బుర్రగోక్కుంటూ టేలర్ కుమార్‌ను అడిగాడు టీస్టాల్ నర్సింగ్.‘‘ఆ మాత్రం దానికి ఇంతలా అరుస్తానా? నా ఆటో గొప్పదనం ఏమిటంటే... ఇది ఎక్కి గతంలోకి వెళ్లవచ్చు... ఫ్యూచర్లోకి వెళ్లవచ్చు. అమీర్‌పేట, పంజగుట్ట, ఎర్రమంజిల్... ఇలా రకరకాల స్టాప్‌లు ఉన్నట్లే... నా ఆటోలో సంవత్సరాల పేరుతో స్టాప్‌లు ఉంటాయి. గతంలోకి వెళితే 1920, 1930, 1940... ఇలా ఉంటాయి. ఫ్యూచర్లోకి వెళితే... 2019, 2020, 2040... ఇలా ఉంటాయన్నమాట... మీ ఛాయిస్‌ని బట్టి అక్కడికి నా ఆటోలో తీసుకెళతాను’’ వివరించాడు టేలర్ కుమార్. ‘‘పొద్దుగాల పొద్దుగాల షెవుల పూలు బెడుతున్నవుగదనే!’’ అని పెద్దగా నవ్వాడు నర్సింగ్.‘టైమ్ ఆటో... టైమ్ ఆటో’ అని రోజూ టేలర్ కుమార్ అరుస్తున్నాడేగానీ అతన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. టేలర్ ఆటో అందరికీ వినోదంగా మారింది. అలాంటి రోజుల్లో ఒకరోజు...తన కారులో అటుగా వెళుతున్న ప్రఖ్యాత పారిశ్రామికవేత్త సీఆర్డీ కాటా, టేలర్ అరుపులను విని, ‘‘డ్రైవర్,,,, కారు ఒక పక్కకు ఆపు’’ అన్నాడు. కారును ఒక పక్కన పార్క్ చేసిన తరువాత అతడి ముందు నిల్చున్నాడు కాటా. అయిదారు నిమిషాల తరువాత ‘‘నీ ఆటో ఎక్కుతున్నాను పదా’’ అన్నాడు. టేలర్ కుమార్ ఆనందానికి హద్దులు లేవు. ఈలోపు ఒకడు వచ్చి...‘‘సార్ ఈ వెర్రివాడి మాటలు నమ్మకండి’’ అన్నాడు.‘‘వెర్రిమాటలు కాదు... వీడి కళ్లలో ఏదో నిజా/తీ కనిపిస్తుంది’’ అంటూ ఆటో ఎక్కాడు కాటా.‘‘ ఏ స్టాప్‌కు తీసుకెళ్లమంటారు సార్?’’ అడిగాడు టేలర్. ‘‘కొద్దిసేపు ఆలోచించి చెబుతాను’’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు కాటా. సీఆర్డీ కాటా మరోపారిశ్రామికవేత్త బీఆర్డీ బీటాతో కలిసి కొత్తగా కొన్ని వ్యాపారాల్లోకి దిగాడు.అయితే, బీటా నమ్మదగిన వ్యక్తి కాదని.... మోసగాడని చాలామంది కాటాతో చెప్పారు.కానీ ఆయన వాటిని సీరియస్‌గా తీసుకోలేదు.‘‘నేనే పెద్ద మోసగాడిని.... నన్ను మోసం చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు’’ అంటుండేవాడు కాటా.నిజమే. ఒకప్పుడు బూట్‌పాలిష్ చేసుకొని బతికే కాటప్ప... ఆ తరువాత రౌడీయిజంలోకి దిగి ‘కాటన్న’ అయ్యాడు. ఆ తరువాత ఎన్నో భూకబ్జాలు చేశాడు... ఎంతో మందిని మోసం చేసి కోటీశ్వరుడిగా ఎదిగి తన పేరును ‘సీఆర్డీ కాటా’గా స్టయిలిష్‌గా మార్చుకున్నాడు. కాటాకు తెలియని మోసం అంటూ లేదు...అందుకే అంటాడు...‘‘నన్ను మోసం చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు’’ అని. అలాంటి కాటాకు తన ఫ్యూచర్ చూడాలనిపించింది.‘‘వచ్చే సంవత్సరానికల్లా... మన వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుంది’’ అని బీటా అన్నమాట గుర్తుకు వచ్చింది. వెంటనే...‘‘2019 స్టాప్‌కు తీసుకువెళ్లు’’ అన్నాడు కాటా.‘‘అలాగే’’ అంటూ ఆటోను స్టార్ట్ చేశాడు టేలర్ కుమార్. 2019 సంవత్సరం. మే నెల.సమయం: ఉదయం పదకొండు గంటలు.స్థలం: ఎర్రగడ్డ, రైతు బజారు.ఆటో దిగి రైతు బజార్లోకి నడిచాడు కాటా. అక్కడ ఒక మూల ఒక వ్యక్తి మూడు బుట్టల్లో పువ్వులు, ఆరు బుట్టల్లో మామిడికాయలు ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు.‘పువ్వులు పువ్వులోయ్... కాయలు కాయలోయ్’ అని అరుస్తున్నాడు.ఆ వ్యక్తి ఎవరో కాదు... తనే!‘అంటే 2019లో నా పొజిషన్ ఇదన్నమాట. మూడు పువ్వులు ఆరు కాయలు అంటే ఏమిటో అనుకున్నా... ఇప్పుడు అర్థమైంది’ అంటూ కోపంతో పళ్లుపటపటా కొరికాడు కాటా.తన డైరీ తెరిచి...‘వెనక్కి వెళ్లగానే... ఆ బీటా గాడి పని పట్టాలి’ అని రెడ్ స్కెచ్ పెన్‌తో పెద్ద పెద్ద అక్షరాల్లో రాసుకున్నాడు. ఎందుకో ఆ సమయంలో ఒకసారి నాస్టాల్జియా గాలి అతడిని సోకింది.‘గతంలోకి... అందులోనూ... తాను కొత్తగా హైదరాబాద్‌కు వచ్చిన రోజుల దగ్గరికి వెళ్లాలనిపించింది. 2000 సంవత్సరం డిసెంబర్‌లోకి తీసుకెళ్లు’’ అన్నాడు.‘‘మరో లచ్చరూపాయలు ఖర్చు అవుతుందండీ’’ అన్నాడు టేలర్ కుమార్.‘‘లచ్చగాకుంటే... రెండు లచ్చలు తీసుకో’’ అన్నాడు కాటా. ఆటోను 2000 సంవత్సరం స్టాప్‌లోకి తీసుకెళ్లాడు టేలర్ కుమార్.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు...‘‘పాలీష్... బూట్ పాలీష్... తళతళ మెరిసే పాలీష్’ అని అరుస్తున్నాడు బక్కపల్చటి కుర్రాడు కాటప్ప. ‘‘అటు చూడు కుమార్.... ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని. జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్’’ అంటూ కర్చీప్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు కాటా. కొద్దిసేపటి తరువాత... ‘‘ఆలస్యం చేయకుండా 2018 స్టాప్‌కి తీసుకెళ్లు. ఆ బీటాగాడి పని పట్టాలి’’ అన్నాడు పిడికిలి బిగిస్తూ కాటా. ఆటో స్టార్ట్ చేశాడు టేలర్. డుర్ర్ర్ర్ర్ర్... అని సౌండ్ వస్తుందేగానీ ఆటో ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు.‘‘ఏమైంది?’’ ఆందోళనగా అడిగాడు కాటా.‘‘ ఇది సెకండ్‌హ్యాండ్ టైమ్‌మిషన్ పార్టులతో తయారుచేసిన ఆటో అండీ. ఎప్పుడు కదులుతుందో ఏమో’’ అని తలపట్టుకున్నాడు టేలర్ కుమార్.‘ఓరీ నీ యబ్బా కడుపు మాడా, టైమ్ మిషన్లలో కూడా ఫస్ట్‌హ్యాండ్ సెకండ్‌హ్యాండ్ ఉంటాయా!!! .... ఇంతకీ మనం ముందుకు వెళతామంటావా?’’ అని ఆందోళనగా అడిగాడు కాటా.‘మన టైమ్ బాగుంటే కచ్చితంగా వెళతామండి... లేకుంటే కచ్చితంగా ఇక్కడే ఉంటామండి’’ అని వినయంగా బదులిచ్చాడు ఎలిజబెత్ టేలర్ కుమార్! – యాకుబ్ పాషా -
పోటీలు మొదలవకముందే పతకం ఖాయం
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ గేమ్స్‌లో ఇంకా పోటీలే మొదలవలేదు. కానీ ఆతిథ్య మహిళా బాక్సర్ టేలా రాబర్ట్‌సన్‌కు పతకం ఖాయమైంది. ఆశ్చర్యమే కానీ ఇది నిజం! బుధవారం ఆరంభోత్సవం జరగ్గా, నేటి నుంచి పోటీలకు తెరలేవనుంది. అయితే మహిళల 51 కేజీల విభాగంలో పోటీదారులు లేక ఈ ఈవెంట్లో ‘డ్రా’ కుదించుకుపోయింది. ఇందులో 19 ఏళ్ల టేలాకు ‘బై’ లభించడంతో ఏకంగా సెమీస్‌లోకి ప్రవేశించింది. బాక్సింగ్ పోటీల్లో సెమీస్‌లో ఓడినా... కనీసం కాంస్యం దక్కుతుంది. కానీ తను మాత్రం కాంస్యంతోనే సరిపెట్టుకోనని... స్వర్ణం కోసమే పోరాడతానని ఆమె చెప్పుకొచ్చింది. -
తొలి వన్డే న్యూజిలాండ్‌దే
వాంగరీ: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న న్యూజిలాండ్ వన్డేల్లోనూ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లెవిస్ (76), పావెల్ (59) అర్ధ సెంచరీలు సాధించారు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (16) విఫలమయ్యాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రేస్‌వెల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసింది. హెరిక్ వర్కర్ (57), టేలర్ (49 నాటౌట్), మున్రో (49) కివీస్‌ను గెలిపించారు. ఈ ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యం సాధించింది. రెండో వన్డే శనివారం క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. -
ఆసీస్‌కు చుక్కలు!
హమిల్టన్:చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీని న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఆదివారం ఆసీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ విసిరిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 257 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. తద్వారా న్యూజిలాండ్ 2-0 తో ట్రోఫీని చేజిక్కించుకుంది. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 281 పరుగులు నమోదు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో రాస్ టేలర్(107) బ్రౌన్లీ(63)లు రాణించగా, కేన్ విలియమ్సన్(37), సాంత్నార్(38)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు కివీస్ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. ప్రధానంగా ఆసీస్ ను కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చావు దెబ్బ కొట్టాడు. పది ఓవర్లలో 33 పరుగులిచ్చి ఆరు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ ను కకావికలం చేశాడు. ఇది వన్డేల్లో బౌల్ట్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనగా నమోదు కావడం విశేషం. అతనికి జతగా సాంత్నార్ రెండు వికెట్లు తీయగా,విలియమ్స్ ను ఒక వికెట్ తీశాడు. ఆసీస్ జట్టులో ఆరోన్ ఫించ్(56), హెడ్(53), స్టోయినిస్(42)లు రాణించినా మిగతా వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
విలియమ్సన్, టేలర్ సెంచరీలు
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (151 బంతుల్లో 113; 10 ఫోర్లు)తో పాటు రాస్ టేలర్ (173 బంతుల్లో 124 నాటౌట్; 10 ఫోర్లు) శతకాలతో రెచ్చిపోయారు. దీంతో ఆదివారం రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ను కివీస్ 150 ఓవర్లలో 582/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులతో రోజును ముగించింది. -
హెయిర్ కట్ తెచ్చిన సమస్య
ఇంగ్లండ్‌లో 11 ఏళ్ల టేలర్ ముచ్చటపడి వెరైటీగా హెయిర్ కట్ చేయించుకున్నాడు. తల వెనుక, పక్కభాగాల్లో చాలా చిన్నగా జుత్తు కత్తిరించుకుని, తల పైభాగంలో మాత్రం కొంచె వెంట్రుకలు కనిపించేలా చేయించుకున్నాడు. గ్రింమ్స్బీలో ఏడో తరగతి చదువుతున్న టేలర్‌కు ఈ హెయిర్ స్టైల్ సమస్యగా మారింది. స్కూల్ టీచర్లు టేలర్‌ను తరగతిలోకి అనుమతించలేదు. టీచర్లు టేలర్ తల్లి సుసాన్ మీడోస్‌ను స్కూలుకు పిలిపించి మాట్లాడారు. టేలర్ వెంట్రుకలు మరీ చిన్నగా ఉన్నాయని, స్కూలు నిబంధనల ప్రకారం అతని హెయిర్ స్టైల్ సముచితంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. టీచర్ల నిర్ణయంపై సుసాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన కొడుకు ఎలాంటి తప్పుచేయలేదని, టీచర్లు ఇలా శిక్షించడం సరికాదని, వారి ప్రాధాన్యాలు తప్పని చెప్పింది. ఈ హెయిర్ కట్ వల్ల టేలర్ చదువుపై ప్రభావం చూపుతుందని చెప్పారని, అతనికి వచ్చిన సమస్య ఏమీ లేదని తెలిపింది. టేలర్‌కు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇదే హెయిర్ కట్‌తో ఉన్నాడని సుసాన్ చెప్పింది. కాగా టీచర్లు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వాపోయింది. స్కూలు డిప్యూటీ ప్రిన్సిపాల్ డారెన్ వుడ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ఒకే యూనిఫాం, ప్రవర్తన నియమాలు పాటించాలని అన్నారు. విద్యార్థులందరిని ఒకేలా చూస్తామని, పాఠశాల నియమాల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. -
మహిళల కొత్త చరిత్ర
► టి20 ప్రపంచకప్ టైటిల్ వెస్టిండీస్ సొంతం ► ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల విజయం మహిళల క్రికెట్లో ఇదో సంచలనం. ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల గుత్తాధిపత్యంలా సాగిన టి20 ఫార్మాట్లో వెస్టిండీస్ మహిళలు కొత్త చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఫైనల్లో చిత్తు చేసి తొలిసారి టైటిల్ సాధించారు. ఆస్ట్రేలియా స్కోరు 148... గెలిచేందుకు సరిపోయే స్కోరుకంటే తాము ఎక్కువగానే చేశామని ఆ జట్టు ప్లేయర్ విలాని చెప్పేసింది. తమతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తున్న విండీస్‌ను కంగారూలు తక్కువగా అంచనా వేశారు. మొదటి మూడు ఓవర్లలో విండీస్ 9 పరుగులు చేయగానే సంబరపడి పట్టు సడలించారు. అంతే... ఆ తర్వాత మ్యాథ్యూస్, టేలర్‌ల సెంచరీ భాగస్వామ్యం కరీబియన్లను విశ్వవిజేతగా నిలపగా... నిరాశగా చూస్తుండటం మినహా ఆసీస్ ఏమీ చేయలేకపోయింది ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 19.3 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి టోర్నీని చేజిక్కించుకుంది. వరుసగా గత మూడు వరల్డ్‌కప్‌లలో విజేతగా నిలిచి నాలుగో టైటిల్ మీద కన్నేసిన ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు. మొదటి సారే ఫైనల్‌కు చేరినా... సమరోత్సాహం ప్రదర్శించిన విండీస్ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. కీలక భాగస్వామ్యం: ఆరంభంలోనే హీలీ (4)ను అవుట్ చేసి విండీస్ శుభారంభం చేసింది. అయితే విలాని (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), కెప్టెన్ లానింగ్ (49 బంతుల్లో 52; 8 ఫోర్లు) కలిపి జట్టును నడిపించారు. ముఖ్యంగా దూకుడుగా ఆడిన విలాని 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 10 ఓవర్లలో 77 పరుగులు జోడించారు. విలాని వెనుదిరిగినా... లానింగ్, పెర్రీ (23 బంతుల్లో 28; 2 సిక్సర్లు) కలిసి 34 బంతుల్లో 42 పరుగులు జోడించారు. అయితే చివర్లో కట్టడి చేసిన విండీస్ బౌలర్లు ఆఖరి 5 ఓవర్లలో 34 పరుగులే ఇవ్వడంతో ఆసీస్ స్కోరు 150 పరుగుల లోపే ఆగిపోయింది. ఆ ఇద్దరూ అదుర్స్: విండీస్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభించిన హేలీ మ్యాథ్యూస్ (45 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (57 బంతుల్లో 59; 6 ఫోర్లు) ఆ తర్వాత జోరు పెంచారు. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 120 పరుగులు జోడించిన అనంతరం ఎట్టకేలకు వికెట్ పడింది. 26 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన ఈ దశనుంచి విండీస్ వేగంగా విజయం వైపు దూసుకుపోయింది. లక్ష్యానికి చేరువైన తర్వాత టేలర్ కూడా అవుటైనా, డాటిన్ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) పని పూర్తి చేసింది. మ్యాథ్యూస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలు వగా, టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు టైటిల్ అందించిన స్టెఫానీ టేలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) అండ్ (బి) మ్యాథ్యూస్ 4; విలాని (సి) టేలర్ (బి) టేలర్ 52; లానింగ్ (ఎల్బీ) (బి) మొహమ్మద్ 52; పెర్రీ (ఎల్బీ) (బి) డాటిన్ 28; బ్లాక్వెల్ (నాటౌట్) 3; ఆస్బోర్న్ (రనౌట్) 0; జొనాసెన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1-15; 2-92; 3-134; 4-147; 5-147. బౌలింగ్: కానెల్ 2-0-15-0; మ్యాథ్యూస్ 2-0-13-1; టేలర్ 3-0-26-0; డాటిన్ 4-0-33-2; ఫ్లెచర్ 1-0-9-0; మొహమ్మద్ 4-0-19-1; క్వింటైన్ 4-0-27-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: మ్యాథ్యూస్ (సి) బ్లాక్వెల్ (బి) బీమ్స్ 66; టేలర్ (సి) జొనాసెన్ (బి) ఫారెల్ 59; డాటిన్ (నాటౌట్) 18; కూపర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1-120; 2-144. బౌలింగ్: జొనాసెన్ 4-0-26-0; పెర్రీ 3.3-0-27-0; షుట్ 3-0-26-0; ఫారెల్ 4-0-35-1; బీమ్స్ 4-0-27-1; ఆస్బోర్న్ 1-0-6-0. -
పూసే విరబూసే పండగ
నాస్టాల్జియా సంక్రాంతి పండగ అంతకు పది రోజుల ముందు నుంచి న్యూస్ పేపర్ల ఫుల్‌పేజీ సినిమా యాడ్లతో మొదలయ్యేది. జనవరి 11 ఉ.9.30 గం. ఆటతో బ్రహ్మాండమైన విడుదల. దాంతో పాటే థియేటర్ల లిస్టూ ఇచ్చేవారు. మనూరులో మనం రోజూ చూసే థియేటర్ పేరు పేపర్లో రావడం ఒక గొప్ప. అందులో మన హీరో సినిమా రావడం ఇంకా గొప్ప. 11న ఒకటి, 12న ఒకటి, 13న ఒకటి, పద్నాలుగున ఒకటి. అన్నింటికీ డబ్బు కూడ బెట్టుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పెద్దలు పెద్ద మనసు చేసుకొని పిల్లలకు పైసలు ఇచ్చే పండగ. పిల్లలు నిజమైన సంబరంలో మునిగే పండగ. కాని సగం ఆనందం టైలర్లు కాజేసేవారు. రైలు రాకపోకలకన్నా గ్యారంటీ ఉండేదేమోకాని వీళ్లు కుట్టిన గుడ్డలు ఇస్తారో ఇవ్వరో అనేదానికి మాత్రం ఎవరూ గ్యారంటీ ఇచ్చేవారు కాదు. అసలే కొత్తబట్టలంటే సంక్రాంతికి మాత్రమే కుట్టించేవారు. వాటి కోసం సంవత్సరం మొత్తం ఆగాలి. స్కూల్లో గొప్పలు చెప్పుకోవాలి. పండగ రోజు ధరించి ఫ్రెండ్స్ ఇంటికి క్యాజువల్‌గా వెళ్లినట్టు వెళ్లి చూపించుకోవాలి. చెప్పులు లేకపోతే ఏమీ టక్ చేసుకొని దర్జాగా తిరగాలి. కాని ఎన్నిసార్లు టైలర్ షాప్ ముందు తిరిగినా మన బట్టలు అలాగే మూట గట్టి పడి ఉండేవి. అదృష్టం బాగుంటే ష్రింక్ కోసమని తడిపి ఆరేశాక దండెం మీద కనిపించేవి. అన్నాళ్లు ఎవరూ పట్టించుకోని టైలర్ ఆ కొన్నిరోజులు ఊరి ఎమ్మెల్యే చేత కూడా సలాం కొట్టించుకునేవాడు. స్లీపింగ్ టేప్రికార్డర్లో పాటలు వింటూ అర్ధరాత్రి కూడా అతడు కుడుతూ ఉంటే అమ్మా నాన్నలకు చెప్పి అక్కడే కూర్చొని తెల్లారుతుండగా కాజాలు పూర్తి చేసి ఇంటికి పరిగెత్తుకురావడం జ్ఞాపకం. హరిదాసులకు బియ్యం పొయ్యడం బాగుండేది. గంగిరెద్దులవాళ్లకు పాత వస్త్రం ఇవ్వమని నాన్న అంటే అమ్మ ఒకటి కాదని మరొకటి ఇవ్వడమూ బాగుండేది. బుడబుడలవాడు నల్లగొడుగేసుకొని వచ్చి కుడిచేయి విసురుతూ చిట్టి డమరుకం డమడమలాడిస్తుంటే వీధి కుక్కలు వెంట పడాల్సింది పోయి తోక ముడిచేవి. పిల్లలు ఎందుకైనా మంచిదని అమ్మ కొంగుచాటు దాక్కుని చూసేవారు. కాని ఆ దేవర దీవెన ఎంత చల్లన! ఔట్‌లైన్ అక్క వేస్తుంది. లోపల కలర్ మనమే నింపాలి. ముగ్గుల సౌందర్యం ముగ్గుతో వస్తుందా? తల్లిదండ్రులు చూస్తూ ఉండగా వాటిలో మునిగే వంశాంకురాలతో వస్తుంది. అరిసెలు చేసే పెద్దమ్మ అంతకు నాలుగు వీధుల అవతల ఉంటుంది. మంచి మాటలు చెప్పి లాక్కురావాలి. ఆమె తీయని అరిసెలు చేసి పెడుతుంటే అంతకంటే తియ్యని కబుర్లను నంజుకోవాలి. జంతికలు సరిగ్గా కుదిరితే కరకరా. కాదంటే హరహరా. నిప్పట్లకు చప్పట్లు. లడ్డూ పిల్లసన్నాసుల హెడ్డుకొకటి. పూలకాలం కదా ఇది. దోసిట్లో నీళ్లు తీసుకొని నేల మీద అలా చిమ్మగానే ఇలా బంతిపూలు పూసుకొచ్చేవి. డిసెంబరాలు ఎరుపుకొచ్చేవి. మందారాలు మౌనంగా మొగ్గ విచ్చేవి. సీతమ్మ జడకుచ్చులు మంచుకు చెమ్మగిల్లి రామయ్యను తలుచుకునేవి. గుమ్మడిపూలు గొబ్బెమ్మల్లోకి... కనకాంబరాలు అమ్మ జడలోకి. తేలిక రంగులు గాలిపటాలకు పనికి రావు. వంకాయ రంగు బాగుంటుంది. రాణీ రంగు బాగుంటుంది. ఎరుపు ఎవర్‌గ్రీనే. ముదురు ఆకుపచ్చ ముస్తాబే వేరు. కాదూ కూడదూ అని లేత నీలిరంగు గాలిపటాన్ని కొని ఎగురవేస్తే అది మబ్బుల్లో ఎగిరి కలగలిసిపోతే మాయమైపోయిందని పిల్లాడు ఏడిస్తే చుట్టూ ఉన్న స్నేహితులందరికీ అది నవ్వుల సంక్రాంతి. చేయి తిరిగినవారు వెజ్ బిరియానీని కూడా మటన్ బిరియానీలా వండుతారు. ప్రావీణ్యం ఉన్నవారు పాయసాన్ని పాయసంలానే చేస్తారు. గారెల సైజు మనసును బట్టి. పులిహోర రుచి హృదయాన్ని బట్టి. అరిటాకులో రోటి పచ్చడి పడితే జిహ్వచాపల్యం ఉన్నవాడికి అది రుచుల సంక్రాంతి. ఈ పండగ ఇంటికి ధాన్యం తెస్తుంది. తీక్షణతను నింపుకున్న వెలుతురును తెస్తుంది. తియ్యని మమతలను పంచే బంధువులను తెస్తుంది. మరో సంక్రాంతి వరకూ కలిసి నడవగలిగిన సంతోషాన్ని తెస్తుంది. వాట్సప్ రావచ్చు. ఫేస్బుక్ రావచ్చు. ఫోన్ కాల్ రావచ్చు. ఈ మెయిల్ రావచ్చు. కాని వేల సంవత్సరాల పరంపర నిండిన ఆ పండగ మనల్ని తాకే తీరుతుంది. దేనికి చెందుతామో దానిని గుర్తు చేసే పండగ ఇది. దేనికి పులకరిస్తామో ఆ పులకరింపును ఇచ్చే పండగ ఇది. దేనిని మర్చిపోకూడదో ఆ జ్ఞాపకాన్ని ఇచ్చే పండగ ఇది. సంక్రాంతి మనది. మనందరిది. - సాక్షి ఫ్యామిలీ దోసిట్లో నీళ్లు తీసుకొని నీళ్ల మీద అలా చిమ్మగానే ఇలా బంతిపూలు పూసుకొచ్చేవి. డిసెంబరాలు ఎరుపుకొచ్చేవి. మందారాలు మౌనంగా మొగ్గ విచ్చేవి. సీతమ్మ జడకుచ్చులు మంచుకు చెమ్మగిల్లి రామయ్యను తలుచుకునేవి. గుమ్మడిపూలు గొబ్బెమ్మల్లోకి. కనకాంబరాలు అమ్మ జడలోకి. -
ఇకనైనా ‘డేర్’ పెరిగేనా !
ఢిల్లీ డేర్ డెవిల్స్... ఓనర్: జీఎంఆర్; కెప్టెన్: కెవిన్ పీటర్సన్ కోచ్: గ్యారీ కిర్‌స్టెన్ గత ఉత్తమ ప్రదర్శన: సెమీఫైనల్ (2008, 2009, 2012(ప్లే ఆఫ్)) కీలక ఆటగాళ్లు: పీటర్సన్, టేలర్, డుమినీ, దినేశ్ కార్తీక్, విజయ్, మహ్మద్ షమీ ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఈ సామెత ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు అతికినట్లుగా సరిపోతుంది.. ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ గత ఆరు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2008, 2009లో సెమీఫైనల్స్‌కు.. 2012లో ప్లే ఆఫ్ దశకు చేరుకున్నా అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో విసిగి వేసారిపోయిన డెవిల్స్ యాజమాన్యం జట్టులో ఉన్న ఆటగాళ్లందరినీ వదిలించుకుంది. ఆ తర్వాత వేలం పాటలో కోట్లు కుమ్మరించి మరీ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఎవరూ ఊహించని విధంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను రూ. 12.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పీటర్సన్‌ను రూ. 9 కోట్లకు, మురళీ విజయ్ రూ. 5 కోట్లకు దక్కించుకుంది. మొత్తానికి గతాన్ని మరిచిపోయి కొత్త లుక్‌తో ఐపీఎల్-7లో బరిలోకి దిగుతున్న ఢిల్లీ.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను సారథిగా నియమించింది. భారమంతా కిర్స్టెన్పైనే... భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి.. విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న కిర్‌స్టెన్ తొలిసారిగా ఐపీఎల్లో కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. గతంలో భారత్ లాగే ఇప్పుడు ఢిల్లీ జట్టును కూడా విజయవంతంగా ముందుకు నడిపిస్తాడని జీఎంఆర్ ఫ్రాంచైజీ ఆశిస్తోంది. ఇక ఢిల్లీ జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి కిర్‌స్టెన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. బలాలు... భారత క్రికెటర్లు, విదేశీ ప్లేయర్లు, దేశవాళీ ఆటగాళ్లతో ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ పీటర్సన్ సీజన్ మొత్తం అందుబాటులో ఉండటం.. విజయవంతమైన కోచ్‌గా కిర్‌స్టెన్‌కు పేరుండటం.. ఈ జట్టు బలాలు.. బలహీనతలు...: కొద్దిమంది ఆటగాళ్లు మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా ఈ జట్టుకు కొత్త.. ఇది మినహాయిస్తే డెవిల్స్‌కు పెద్దగా బలహీనతలేమీ లేవు. జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: దినేశ్ కార్తీక్, మురళీ విజయ్, మహ్మద్ షమీ, మనోజ్ తివారీ, జయ్‌దేవ్ ఉనాద్కట్, రాహుల్ శర్మ, లక్ష్మీ రతన్ శుక్లా, సౌరవ్ తివారీ. విదేశీ క్రికెటర్లు: కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్), జీన్‌పాల్ డుమినీ, క్వింటన్ డికాక్, వేన్ పార్నెల్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్, జేమ్స్ నీషామ్(న్యూజిలాండ్), నాథన్ కౌల్టర్ నైల్ (ఆస్ట్రేలియా), భారత దేశవాళీ క్రికెటర్లు: కేదార్ జాదవ్, మయంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, రాహుల్ శుక్లా, జయంత్ యాదవ్, హెచ్. ఎస్. శరత్, మిలింద్ కుమార్.