
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ గేమ్స్‌లో ఇంకా పోటీలే మొదలవలేదు. కానీ ఆతిథ్య మహిళా బాక్సర్ టేలా రాబర్ట్‌సన్‌కు పతకం ఖాయమైంది. ఆశ్చర్యమే కానీ ఇది నిజం! బుధవారం ఆరంభోత్సవం జరగ్గా, నేటి నుంచి పోటీలకు తెరలేవనుంది. అయితే మహిళల 51 కేజీల విభాగంలో పోటీదారులు లేక ఈ ఈవెంట్‌లో ‘డ్రా’ కుదించుకుపోయింది.
ఇందులో 19 ఏళ్ల టేలాకు ‘బై’ లభించడంతో ఏకంగా సెమీస్‌లోకి ప్రవేశించింది. బాక్సింగ్ పోటీల్లో సెమీస్‌లో ఓడినా... కనీసం కాంస్యం దక్కుతుంది. కానీ తను మాత్రం కాంస్యంతోనే సరిపెట్టుకోనని... స్వర్ణం కోసమే పోరాడతానని ఆమె చెప్పుకొచ్చింది.