వెల్లింగ్టన్: ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి వెస్టిండీస్ పోరాడుతోంది. 386 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (79 బ్యాటింగ్; 7 ఫోర్లు, ఒక సిక్స్), హోప్ (21 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 447/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లకు 520 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి టెస్ట్ ఆడుతున్న టామ్ బ్లండెల్ (107 నాటౌట్; 13 ఫోర్లు ఒక సిక్స్) సెంచరీ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment