దేవుడే దారి చూపాడు.. | Andre Russell Weds Girlfriend Jassym Lora | Sakshi
Sakshi News home page

దేవుడే దారి చూపాడు..

Published Sat, Jul 30 2016 2:37 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

దేవుడే దారి చూపాడు..

దేవుడే దారి చూపాడు..

చిన్నప్పుడు తల్లి ఎంత వారించినా గ్రౌండ్ వైపు పరుగులు తీశాడు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా క్రికెట్ బ్యాట్ పట్టాడు. మైదానాన్నే సర్వస్వంగా భావించాడు. తనవైన టెక్నిక్స్ తో ఆటలో రాణించాడు. డొమెస్టిక్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. సమకాలీన క్రికెట్ చరిత్రలో అరివీరభయంకరుడు అనదగ్గ ఆల్ రౌండర్లలో ఒకరైన జమైకన్ పుత్రుడు ఆండ్రీ రస్సెల్.. తన జీవితంలో చోటుచేసుకున్న అన్ని మలుపులకూ దేవుడే కారణం అంటాడు. తన వివాహవేడుకలోనూ ఇదే చెప్పాడు.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన గర్ల్ ఫ్రెండ్ జాసిమ్ లోరాను శుక్రవారం పెళ్లిచేసుకున్నాడు. డోమినికన్ రిపబ్లిక్ కు చెందిన జాసిమ్ మోడల్ గా కొనసాగుతోంది. చాలా ఏళ్ల కిందటే వీరిమధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి 2014లో నిశ్చితార్థానికి దారితీసింది. ఇప్పుడు పెళ్లితో శుభంకార్డు పడినట్లైంది. 'ఏ విషయంలోనైనా దేవుణ్ని ముందుంచుకోవాలి.. ఆయనే దారి చూపిస్తాడు'అని ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లిఫొటోతోపాటు కామెంట్ పెట్టాడు రస్సెల్. కెరీర్ పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ విండీస్ క్రికెటర్ కు ఆటలో ఎదురైన విఘ్నాలను కూడా దేవుడే తొలిగించాలని కోరుకుందాం! ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రస్సెల్ కు ఆ జట్టు యాజమాన్యం వివాహ శుభాకాంక్షలు తెలిపింది. (ప్రమాదంలో రస్సెల్ కెరీర్?)


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement