టీ20 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. గ్రూపు-ఎ నుంచి సెమీస్ బెర్త్ ఖారారు చేసుకుంది.
ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కైల్ మైర్స్(35) పరుగులతో రాణించాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షమ్సీ 3 వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, మార్‌క్రమ్, రబాడ తలా వికెట్ సాధించారు. అనంతరం 136 పరుగుల లక్ష్యంతో దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ప్రోటీస్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులకు కుదించారు. అనంతరం 7 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో దక్షిణాఫ్రికా తమ లక్ష్యాన్ని చేధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో స్టబ్స్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టారు.
దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సౌతాఫ్రికా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.
ఈ ఏడాది మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన దక్షిణాప్రికా ఏడింటా గెలుపొందింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. 2009 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తాజా మ్యాచ్‌తో లంక రికార్డును ప్రోటీస్ బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment