
Umpire Aleem Dar: టీ20 ప్రపంచకప్2021 సూపర్-12 రౌండ్‌లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్‌కు పెను ప్రమాదం తప్పింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన ప్రిటోరియాస్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ బౌలర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అంపైర్ అలీమ్ దార్ వైపు వేగంగా దూసుకొచ్చింది.
వెంటనే అప్రమత్తమైన అతడు తప్పించుకుని కింద పడిపోయాడు. అయితే బంతి నేరుగా లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ దుసాన్ చేతికి వెళ్లింది. వెంటనే అతడు రనౌట్‌కు ప్రయత్నించి చాలా వేగంగా బౌలర్ ఎండ్‌వైపు త్రో చేశాడు. దీంతో అలీమ్ దార్ మరోసారి బంతి నుంచి తప్పించుకున్నాడు. అలీమ్ దార్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆటగాళ్లంతా ఊపిరి పీల్చకున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: Pak Vs NZ: కంగ్రాట్స్ న్యూజిలాండ్... పాకిస్తాన్ సేఫ్.. కానీ మా జట్టు మాత్రం డేంజర్: అక్తర్
Aleem Dar 🥶 pic.twitter.com/33nwLghf71
— Abdul Hadi 🇵🇰 (@Abdul_Hadi_1) October 26, 2021