Aleem Dar
-
పాకిస్తాన్ సెలెక్షన్ కమిటీలోకి మాజీ అంపైర్
ముల్తాన్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం ఎదురైన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసక్తికర నిర్ణయం తీసుకుంది. పీసీబీ ఆ దేశ సెలెక్షన్ కమిటీలో పలు మార్పులు చేసింది. ఓ మాజీ అంపైర్ సహా మరో ఇద్దరిని కొత్తగా చేర్చింది. ఇటీవలే అంపైరింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అలీం దార్, మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావెద్, అజర్ అలీ కొత్తగా సెలెక్షన్ కమిటీలో చేరారు. ఈ ముగ్గురికి పీసీబీ ఓటింగ్ హక్కు కల్పించింది. వీరితో పాటు ఇదివరకే సెలెక్షన్ కమిటీలో ఉన్న హసన్ చీమాకు కూడా పీసీబీ ఓటింగ్ హక్కు కల్పించింది. కాగా, పది రోజుల కిందటే మొహమ్మద్ యూసఫ్ సెలెక్షన్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేశాడు. ఇంతలోనే పీసీబీ కొత్తగా మరో ముగ్గురిని సెలెక్షన్ కమిటీలోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోనని పాక్ క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ముల్తాన్ టెస్ట్‌లో పాక్ పర్యాటక ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. చదవండి: డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్ సిరాజ్ -
19 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ అంపైర్
దిగ్గజ అంపైర్ అలీమ్ దార్ తన 19 ఏళ్ల అంపైరింగ్ కెరీర్‌కు గురువారం వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌కు చెందిన 54 ఏళ్ల అలీమ్ దార్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌గా విధులు నిర్వర్తించారు. దిగ్గజ అంపైర్‌గా పేరు పొందిన ఆయన రికార్డు స్థాయిలో 435 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇందులో 2007, 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌తో పాటు 2010, 2012 టి20 వరల్డ్‌కప్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. 2000లో అంపైర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అలీమ్‌దార్ పాకిస్తాన్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైరింగ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వ్యక్తిగా నిలిచిపోయారు. మొత్తంగా 435 మ్యాచ్‌ల్లో 222 వన్డేలు, 144 టెస్టులు, 69 టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్ నిర్వహించారు. ఇక ఐదు వన్డే వరల్డ్‌కప్, ఏడు టి20 వరల్డ్‌కప్స్‌కు అంపైర్‌గా పనిచేశారు. 2009, 2010, 2011లో వరుసగా మూడుసార్లు డేవిడ్ షెపర్డ్ ట్రోఫీ(ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్)ని గెలుచుకోవడం విశేషం. అంపైరింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై అలీమ్ దార్ స్పందిస్తూ.. ''అంపైర్‌గా లాంగ్ జర్నీని బాగా ఎంజాయ్ చేశాడు. ఒక అంపైర్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పేరు తెచ్చుకోవడం గౌరవంగా భావిస్తున్నా. అంపైరింగ్ కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలో ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు. మూడుసార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోవడం నా కెరీర్లోనే పెద్ద అచీవ్మెంట్. 19 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఇప్పుడున్న అంపైర్లకు నా సలహా ఏంటంటే.. కష్టపడండి, మర్యాదగా నడుచుకోండి..కొత్త విషయాలను నేర్చుకోవడం ఎప్పటికి ఆపకండి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఐసీసీ తమ ఎలైట్ ప్యానెల్ అంపైరింగ్ సభ్యులను 12కు పెంచింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూజిలాండ్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), మరైస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా), మైకేల్ గోఫ్ (ఇంగ్లండ్), నితిన్ మీనన్ (భారత్), పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) , రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లాండ్), రోడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా), జోయెల్ విల్సన్ (వెస్టిండీస్), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా) మరియు అహ్సన్ రజా (పాకిస్థాన్). చదవండి: సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా -
PAK VS NZ 2nd ODI: పాక్ జెర్సీని నేలకేసి కొట్టిన అంపైర్
కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. నవాజ్ (4/38), నసీమ్ షా (3/58) కివీస్ పతనాన్ని శాశించారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సాంట్నర్, బ్రేస్‌వెల్, ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. Ouch 😬🙏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/JyuZ0Jwxi5 — Pakistan Cricket (@TheRealPCB) January 11, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఊహించని పరిణామం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో (39వ ఓవర్లో)పాక్ ఆటగాడు మహ్మద్ వసీం జూనియర్ వికెట్లకు గురిపెట్టి విసిరిన ఓ త్రో ఫీల్డ్ అంపైర్ అలీం దార్ కాలికి బలంగా తాకింది. బంతి తాకిడికి చిర్రెత్తిపోయిన అంపైర్, చేతిలో ఉన్న పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఆతర్వాత గ్రౌండ్లో ఉన్న పాక్ ఆటగాళ్లు అంపైర్ కాలిని రుద్దుతూ సేవలు చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డే సోషల్‌మీడియాలో షేర్ చేసింది. -
బంతి గట్టిగా తగిలినట్టుంది.. పాపం అంపైర్
క్రికెట్ గ్రౌండ్లో బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్లతో పాటు అంపైర్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఓవర్ త్రోలు.. బ్యాట్స్‌మెన్ కొట్టే షాట్ల నుంచి తప్పించుకుంటూ అంపైర్లు స్టంట్స్ చేయడం గమనిస్తుంటాం. అయితే ఒక్కోసారి అనుకోని పరిస్థితుల వల్ల అంపైర్లకు గాయాలైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్‌కు ఇలాంటిదే ఎదురైంది. టి10 లీగ్ 2021-22లో భాగంగా చెన్నై బ్రేవ్స్, నార్తన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఐదో ఓవర్లో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని అందుక్ను ఫీల్డర్ మరొక ఫీల్డర్‌కు అందించాలనే ఉద్దేశంతో ఓవర్ త్రో వేశాడు. అంపైర్ అలీమ్ దార్ ఓవర్ త్రో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరిగెత్తాడు. అయితే దురదృష్టవశాత్తూ అలీమ్ దార్ వైపే బంతి వచ్చి వెనుక నుంచి తలకు బలంగా తాకింది. క్యాప్ ఉండడంతో బంతి తగిలినప్పటికి పెద్దగా గాయం కాలేదు. వెంటనే ఫిజియో వచ్చి తల నిమరడంతో నొప్పి తగ్గడంతో అలీమ్ దార్ తన విధులు నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Aleem Dar 🤣🤣 pic.twitter.com/Zp0mL8xwj6 — Stay Cricket (@staycricket) November 24, 2021 -
SA Vs WI: పెను ప్రమాదం తప్పించకున్న పాక్ అంపైర్ .. వీడియో వైరల్
Umpire Aleem Dar: టీ20 ప్రపంచకప్2021 సూపర్-12 రౌండ్లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్‌కు పెను ప్రమాదం తప్పింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన ప్రిటోరియాస్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ బౌలర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అంపైర్ అలీమ్ దార్ వైపు వేగంగా దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన అతడు తప్పించుకుని కింద పడిపోయాడు. అయితే బంతి నేరుగా లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ దుసాన్ చేతికి వెళ్లింది. వెంటనే అతడు రనౌట్‌కు ప్రయత్నించి చాలా వేగంగా బౌలర్ ఎండ్‌వైపు త్రో చేశాడు. దీంతో అలీమ్ దార్ మరోసారి బంతి నుంచి తప్పించుకున్నాడు. అలీమ్ దార్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆటగాళ్లంతా ఊపిరి పీల్చకున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Pak Vs NZ: కంగ్రాట్స్ న్యూజిలాండ్... పాకిస్తాన్ సేఫ్.. కానీ మా జట్టు మాత్రం డేంజర్: అక్తర్ Aleem Dar 🥶 pic.twitter.com/33nwLghf71 — Abdul Hadi 🇵🇰 (@Abdul_Hadi_1) October 26, 2021 -
'నా నిర్ణయం వ్యతిరేకిస్తారా.. ఇప్పుడు చూడండి'
కరాచీ: క్రికెట్లో డీఆర్ఎస్ రూల్స్ ప్రవేశపెట్టాకా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఒకసారి అనుకూలంగా ఉంటే మరోసారి వ్యతిరేకంగా ఉంటాయి. వారిచ్చిన నిర్ణయం నచ్చకపోతే రివ్యూ కోరే అవకాశాన్ని ఇరు జట్ల ఆటగాళ్లకు కల్పించారు. అయితే కొన్ని సందర్భాల్లో నాటౌట్ అని తెలిసి కూడా ఫీల్డ్ అంపైర్ మాట లెక్కచేయకుండా ఆటగాళ్లు రివ్యూలకు వెళుతుంటారు. రివ్యూ వ్యతిరేకంగా రాగానే ఆటగాళ్లు నిరాశకు లోనవుతుంటారు. ఇది ఇప్పటికే చాలాసార్లు నిరుపితమైంది. అదే సమయంలో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం సరైందని తెలిసి లోలోపల సంతోషిస్తుంటారే తప్ప ఎమోషన్స్‌ను బయట పడనివ్వరు. తాజాగా సీనియర్ అంపైర్ అలీమ్ దార్ మాత్రం ఎమోషన్‌ను దాచుకోలేకపోయారు. అసలు విషయంలోకి వెళితే.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా బుధవారం ఇస్లామాబాద్ యునైటెడ్స్, కరాచీ కింగ్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక్క పరుగు చేస్తే ఇస్లామాబాద్ విజయం సాధిస్తుంది. మక్సూద్ వేసిన తొలి బంతిని ఆసిఫ్ అలీ థర్డ్ మన్ దిశగా ఫ్లిక్ చేసి పరుగు పూర్తి చేశాడు. అయితే మక్సూద్ అలీ బంతి ప్యాడ్‌కు తాకి వెళ్లిందోమోనన్న అనుమానంతో ఎల్బీకి అప్పీల్ చేశాడు. అయితే బంతి ప్యాడ్లను తాకినా వికెట్లకు చాలా ఎత్తులో నుంచి వెళుతుండడంతో ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్ నాటౌట్ అని పేర్కొన్నాడు. దీంతో కరాచీ కింగ్స్ డీఆర్ఎస్కు వెళ్లింది. అయితే రిప్లేలో కూడా బంతి అల్ట్రా ఎడ్జ్ తీసుకొని వికెట్ల పైనుంచి వెళుతున్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ అని ఇచ్చాడు. దీంతో ఇస్లామాబాద్ సంబరాల్లో మునిగిపోగా.. కరాచీ కింగ్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాను చెప్పినా వినకుండా కరాచీ కింగ్స్ రివ్యూకు వెళ్లిందన్న కారణంతో అలీమ్ దార్ .. యా.. నేనే విజయం సాధించా.. అన్నట్లు సైగలు చేశాడు. అలీమ్ దార్ చర్యను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇస్లామాబాద్ యునైటెడ్స్ కరాచీ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇస్లామాబాద్ బ్యాటింగ్‌లో అలెక్స్ హేల్స్ 46, ఇఫ్తికర్ అహ్మద్ 49, హుస్సేన్ తలాత్ 42 పరుగులతో రాణించారు. చదవండి: డబుల్ సెంచరీ... పృథ్వీ షా సరికొత్త రికార్డు Aleem Dar Thug Life Moment at the End when they lost the review 🤣🤣🤣 pic.twitter.com/boldCdV4S7 — Taimoor Zaman (@taimoorze) February 24, 2021 -
ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు..
పెర్త్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాళ్ల గాయాల బెడడ తప్పటం లేదు. రొజుకొకరు చొప్పున గాయపడటం ఇరు జట్లను కలవరపెడుతోంది. తొలి రోజు కివీస్ బౌలర్ ఫెర్గుసన్ గాయంతో ఈ టెస్టుకు దూరం కాగా.. రెండో రోజు ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ గాయంతో ఈ సిరీస్‌కే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మూడో రోజు ఆటలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పాకిస్తాన్ సీనియర్ అంపైర్ అలీమ్ దార్ గాయపడ్డాడు. గాయంతో విలవిల్లాడిన ఆయన మైదానంలో కుప్పకూలాడు. అలీమ్ దార్‌కు గాయం జరిగిన తీరు చూశాకా ఈ టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపించాయి. అనంతరం ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తిరిగి అంపైరింగ్ చేశాడు. దీంతో కథ సుఖాంతమైంది. అసలేం జరిగిందంటే? ఆస్ట్రేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టిమ్ సౌథీ వేసిన బంతిని మార్నస్ లబుషేన్ డిఫెన్స్ ఆడాడు. ఇదే సమయంలో మరో ఎండ్‌లో ఉన్న నాన్ స్ట్రైకర్ బర్న్స్ సింగిల్ తీసే ప్రయత్నంలో సగం క్రీజు వరకు వెళ్లాడు. ఈ క్రమంలో బంతి అందుకున్న బౌలర్ టిమ్ సౌథీ వికెట్లపై విసిరాడు. ఆ బంతి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అలీమ్ దార్, ఇదే క్రమంలో ఆ బంతిని అందుకోవాలని కివీస్ ఆల్‌రౌండర్ సాంట్నర్ చేసిన ప్రయత్నంలో వీరిద్దరూ ఢీ కొట్టకున్నారు. అయితే సాంట్నర్ అలీమ్‌ను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కుదర్లేదు. చికిత్స అనంతరం అలీమ్ దార్ అంపైరింగ్ చేయడంతో ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ‘400 నాటౌట్.. 434 ఛేజింగ్ చూశా’ మూర్ఖులు అర్థం చేసుకోలేరు -
ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు..
-
‘400 నాటౌట్.. 434 ఛేజింగ్ చూశా’
పెర్త్: పాకిస్తాన్‌కు చెందిన అంపైర్ అలీమ్ దార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డును అలీమ్ దార్ తన పేరిట లిఖించుకున్నారు. తద్వారా ఇప్పటివరకూ వెస్టిండీస్ అంపైర్ స్టీవ్ బక్నర్ పేరిట ఉన్న అత్యధిక టెస్టు మ్యాచ్‌ల అంపైరింగ్ రికార్డును అలీమ్ దార్ బ్రేక్ చేశారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా చేయడం ద్వారా అలీమ్ దార్ ఈ రికార్డును నెలకొల్పారు. 207 వన్డేలకు, 46 అంతర్జాతీయ టీ20లకు అంపైర్‌గా పని చేసిన అలీమ్ దార్‌కు ఇది 129వ టెస్టు మ్యాచ్ అంపైరింగ్ కావడం విశేషం. 1989-2009 మధ్య కాలంలో బక్నర్ 128 టెస్టులకు 181 వన్డేలకు అంపైర్‌గా పని చేశారు. కాగా, వన్డేల్లో అంపైరింగ్ రికార్డును అందుకోవడానికి ఇంకా రెండు మ్యాచ్‌లు దూరంలో ఉన్నారు దార్. దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్టెజన్ 209 వన్డేలకు అంపైర్‌గా చేసి తొలి స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్లో దశాబ్దానికి పైగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన 51 ఏళ్ల అలీమ్ దార్.. తన ఆన్ ఫీల్డ్ అంపైరింగ్ కెరీర్‌ను 2003లో ఇంగ్లండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలో జరిగిన మ్యాచ్ ద్వారా ఆరంభించారు. తన తాజా ఘనతపై అలీమ్ దార్ మాట్లాడుతూ.. ‘ నేను అంపైరింగ్ కెరీర్ మొదలుపెట్టే సమయానికి నేను దీన్ని సాధిస్తానని అనుకోలేదు. ఇది నా అంపైరింగ్ కెరీర్లో ఒక మైలురాయి. ఎన్నోవేల మైళ్ల ప్రయాణంలో ఇదొక తీపి జ్ఞాపకం. నా ప్రయాణంలో ఎన్నో ఘనతలు చూశా. టెస్టు ఫార్మాట్లో బ్రియాన్ లారా అజేయంగా 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు 2006లొ ఆస్ట్రేలియా నిర్దేశించిన 434 పరుగుల వన్డే లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేజింగ్ చేయడం కూడా చూశా’ అని అలీమ్ దార్ ఆనందం వ్యక్తం చేశారు. -
అంపైరింగ్ వరల్డ్ రికార్డు సమం!
లండన్: పాకిస్తాన్‌కు చెందిన క్రికెట్ అంపైర్ అలీమ్ దార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన అలీమ్ దార్.. స్టీవ్ బక్నర్(వెస్టిండీస్) రికార్డును సమం చేశారు. ఇప్పటివరకూ స్టీవ్ బక్నర్ 128 టెస్టు మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసి టాప్‌లో ఉండగా, ఇప్పుడు అతని సరసన 51 ఏళ్ల అలీమ్ దార్ నిలిచారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో అలీమ్ దార్ ఈ మార్కును చేరారు. దీనిపై అలీమ్ దార్ మాట్లాడుతూ.. ఇదొక అతి పెద్ద ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అందులోనూ తన రోల్ మోడల్ బక్నర్ సరసన నిలవడం ఇంకా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఘనత సాధించడానికి ఆ దేవుడి సాయంతో పాటు ఐసీసీ, పీసీబీల సహకారం కూడా మరువలేనిదన్నారు. తన సహచరులకు, తన కోచ్‌లకు అలీమ్ దార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల సహకారం వెలకట్టలేనిదని, వారు నుంచి తనకు సహకారం అందకపోతే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. 2003లో ఢాకాలో ఇంగ్లండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టెస్టు ఫార్మాట్లో అంపైర్‌గా అరంగేట్రం చేసిన అలీమ్ దార్.. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 376 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. -
లెక్క తప్పిన ఫీల్డ్ అంపైర్..!
డర్బన్: అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) మరోసారి వివాదాస్పమైంది. ఇటీవల భారత్‌తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ ఆటగాడు డార్లీ మిచెల్ ఎల్బీగా ఔటైన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఆరో ఓవర్లో మిచెల్ (1) ఎల్బీగా వెనుదిరిగాడు. మొదట అంపైర్ క్రిస్ బ్రౌన్.. మిచెల్ ఔట్ అని ప్రకటించాడు. ఆపై అవతలి ఎండ్‌లో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంప్రదించిన తర్వాత మిచెల్ డీఆర్ఎస్కు వెళ్లాడు. హాట్ స్పాట్లో బ్యాట్‌కు బంతి తగిలినట్లు చూపించగా, స్నికో మీటర్లో దీనికి విరుద్దంగా కనిపించింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. దాంతో బాల్ ట్రాకింగ్ ఆధారంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. ఇది వివాదాస్పమైంది. తాజాగా డీఆర్ఎస్పై ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్ చేసిన తప్పిదం హాట్ టాపిక్ అయ్యింది. డర్బన్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో విశ్వ ఫెర్నాండో వేసిన రెండో ఓవర్లోనే సఫారీ ఓపెనర్ డీన్ ఎల్గర్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్లో మరొక బంతి నేరుగా హషీమ్ ఆమ్లా ప్యాడ్లకు తాకింది. అయితే ఎల్బీ కోసం ఫెర్నాండో అప్పీల్ చేయగా ఫీల్డ్ అంఫైర్ అలీమ్ దార్ దానిని తిరస్కరించాడు. బౌలర్, ఇతర ఆటగాళ్లతో చర్చించాక శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే డీఆర్ఎస్ కోరాడు. అయితే, అప్పటికే సమయం మించిపోయిందన్న కారణంతో దార్ రివ్యూకు ఒప్పుకోలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి డెడ్ అయ్యాక 15 సెకండ్ల లోపు సమీక్ష కోరాలి. కాగా, 10 సెకన్లు ముగిశాక బౌలర్ ఎండ్‌లో ఉన్న అంపైర్.. డీఆర్ఎస్ సమయాన్ని గుర్తు చేయాలి. కానీ, అలీమ్ దార్ ఎలాంటి హెచ్చరిక చేయకపోవడం... శ్రీలంక కెప్టెన్ నిర్ణీత సమయంలో అప్పీల్ చేసినా తిరస్కరించడం ఇప్పుడు వివాదంగా మారింది. శ్రీలంక రివ్యూ కోరే సమయానికి 13.79 సెకన్లు మాత్రమే అయ్యింది. అంటే దాదాపు సెకనకుగా పైగా సమయముంది. దాంతో డీఆర్ఎస్ సమయాన్ని లెక్కించడంలో అంపైర్ తప్పుచేశాడంటూ విమర్శల వర్షం కురుస్తోంది. -
విరాట్ కు అంపైర్ కుమారుడు సైతం..
కింగ్ స్టన్: గత కొంతకాలంగా ప్రపంచ క్రికెట్ లో తనదైన మార్కుతో చెలరేగిపోతున్న భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై అభిమానానికి దేశ హద్దులు సైతం చెరిగిపోతున్నాయి. ఇటీవల వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కుమారుడు మాలి రిచర్డ్స్ స్వయంగా పెయింట్ చేసిన బహుమతిని విరాట్ కు అందజేసిన అభిమానం చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ కుమారుడు హసన్ దార్ కూడా తాను సైతం అంటూ విరాట్ పై అభిమానాన్ని తెలియజేశాడు. ప్రస్తుతం భారత-వెస్టిండీస్ టెస్టు సిరీస్ లో అలీమ్ దార్ అంపైర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన తండ్రి ద్వారా ఆ మెస్సేజ్ ను పంపిన హసన్.. విరాట్ పై తన ఇష్టాన్ని తెలియజేశాడు. ప్రత్యేకంగా విండీస్ పై కోహ్లి నమోదు చేసిన డబుల్ సెంచరీని హసన్ ప్రశంసించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోహ్లి.. తిరిగి మరొక వీడియో సందేశాన్ని పంపించాడు. తాను క్రికెట్ ను ఎక్కువగా ఆరాధిస్తానని, అందుకోసం ఎక్కువ శ్రమిస్తానన్నాడు. తనపై నమ్మకాన్ని కాపాడుకోవడంతోనే క్రికెట్లో రాణిస్తున్నానని పేర్కొన్నాడు. దాంతోపాటు స్వయంగా తాను సంతంకం చేసిన బ్యాట్‌ను త్వరలో బహుమతిగా పంపుతున్నట్లు విరాట్ తన సందేశంలో పేర్కొన్నాడు. -
అలీమ్ దార్ స్థానంలో ఎస్ రవి
దుబాయ్: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య గురువారం చెన్నైలో జరుగనున్న నాల్గో వన్డేలో అంపైరింగ్ చేసేందుకు పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ స్థానంలో సుందరమ్ రవిని నియమించారు. భద్రతా కారణాలతో పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్కు పిలిచిన నేపథ్యంలో ఎస్ రవిని ఎంపిక చేశారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని సోమవారం శివసేన కార్యకర్తలు ముట్టడించిన అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మ్యాచ్ కు తటస్థ అంపైర్ తో పాటు, ఆతిథ్య అంపైర్ ఉంటే బావుంటుందని భావించిన ఐసీసీ.. సుందర్ రవిని అంపైర్ గా నియమించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడైన రవి.. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న సిరీస్ కు అంపైర్ గా వ్యవహరించాల్సి ఉంది. కాగా, దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరిగే తదుపరి వన్డేకు రవి అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. నాల్గో వన్డేకు ఇద్దరూ కూడా భారత్ కు చెందిన అంపైర్లే ఉంటారని పేర్కొంది. -
ఐసీసీ సంచలన నిర్ణయం
- భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ రీకాల్ దుబాయ్: ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో శివసేన కార్యకర్తలు సృష్టించిన రచ్చ.. దుబాయ్ లోని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)ని కూడా కుదిపేసింది. దాయాది పాకిస్థాన్ తో సిరీస్ వద్దంటూ సోమవారం ఉదయం శివసేన కార్యకర్తలు బీసీసీఐ కార్యాలయాన్ని ముట్టడించడం, అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఛాంబర్లోకి చొరబడి రచ్చచేసిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను వెనక్కి పిలిపిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ప్రస్తుతం భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతోన్న గాంధీ- మండేలా సిరీస్ కు అంపైర్లుగా వ్యవహరిస్తున్నవారిలో అలీమ్ దార్ ఒకరు. బీసీసీఐ కార్యాలయంలో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలోనే అలీమ్ దార్ ను ఈ సిరీస్ నుంచి వెనక్కి పిలిపిస్తున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. దార్.. ముంబైలో జరగనున్న ఐదో వన్ డేలో ఫీల్డ్ అంపైర్ గా విధులు నిర్వర్తించాల్సిఉంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా నేతల పేర్లతో జరుగుతున్న ఈ సిరీస్ లో విద్వేషాల కారణంగా ఇలాంటి పరిణామం బాధాకరమని పలువురు క్రీడాభిమానులను వాపోతున్నారు.