
క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్లతో పాటు అంపైర్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఓవర్ త్రోలు.. బ్యాట్స్‌మెన్ కొట్టే షాట్ల నుంచి తప్పించుకుంటూ అంపైర్లు స్టంట్స్ చేయడం గమనిస్తుంటాం. అయితే ఒక్కోసారి అనుకోని పరిస్థితుల వల్ల అంపైర్లకు గాయాలైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్‌కు ఇలాంటిదే ఎదురైంది.
టి10 లీగ్ 2021-22లో భాగంగా చెన్నై బ్రేవ్స్, నార్తన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఐదో ఓవర్‌లో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని అందుక్ను ఫీల్డర్ మరొక ఫీల్డర్‌కు అందించాలనే ఉద్దేశంతో ఓవర్ త్రో వేశాడు. అంపైర్ అలీమ్ దార్ ఓవర్ త్రో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరిగెత్తాడు. అయితే దురదృష్టవశాత్తూ అలీమ్ దార్ వైపే బంతి వచ్చి వెనుక నుంచి తలకు బలంగా తాకింది. క్యాప్ ఉండడంతో బంతి తగిలినప్పటికి పెద్దగా గాయం కాలేదు. వెంటనే ఫిజియో వచ్చి తల నిమరడంతో నొప్పి తగ్గడంతో అలీమ్ దార్ తన విధులు నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Aleem Dar 🤣🤣 pic.twitter.com/Zp0mL8xwj6
— Stay Cricket (@staycricket) November 24, 2021