విరాట్ కు అంపైర్ కుమారుడు సైతం.. | Virat Kohli wins Pakistan fans hearts with special message for umpire Aleem Dar’s son | Sakshi
Sakshi News home page

విరాట్ కు అంపైర్ కుమారుడు సైతం..

Published Fri, Jul 29 2016 5:07 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

విరాట్ కు అంపైర్ కుమారుడు సైతం..

విరాట్ కు అంపైర్ కుమారుడు సైతం..

కింగ్ స్టన్: గత కొంతకాలంగా ప్రపంచ క్రికెట్ లో తనదైన మార్కుతో చెలరేగిపోతున్న భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై అభిమానానికి దేశ హద్దులు సైతం చెరిగిపోతున్నాయి. ఇటీవల వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కుమారుడు మాలి రిచర్డ్స్ స్వయంగా పెయింట్ చేసిన బహుమతిని విరాట్ కు అందజేసిన అభిమానం చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ కుమారుడు హసన్ దార్ కూడా తాను సైతం అంటూ విరాట్ పై  అభిమానాన్ని తెలియజేశాడు.

 

ప్రస్తుతం భారత-వెస్టిండీస్ టెస్టు సిరీస్ లో అలీమ్ దార్ అంపైర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన తండ్రి ద్వారా ఆ మెస్సేజ్ ను పంపిన హసన్.. విరాట్ పై తన ఇష్టాన్ని తెలియజేశాడు. ప్రత్యేకంగా విండీస్ పై కోహ్లి నమోదు చేసిన డబుల్  సెంచరీని హసన్ ప్రశంసించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోహ్లి.. తిరిగి మరొక వీడియో సందేశాన్ని పంపించాడు. తాను క్రికెట్ ను ఎక్కువగా ఆరాధిస్తానని, అందుకోసం ఎక్కువ శ్రమిస్తానన్నాడు. తనపై నమ్మకాన్ని కాపాడుకోవడంతోనే క్రికెట్లో రాణిస్తున్నానని పేర్కొన్నాడు. దాంతోపాటు స్వయంగా తాను సంతంకం చేసిన బ్యాట్ను త్వరలో బహుమతిగా పంపుతున్నట్లు విరాట్ తన సందేశంలో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement